English | Telugu

Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ 8 ప్రోమో రిలీజ్.. ఎప్పుడంటే!


బిగ్ బాస్ తెలుగు 8 కమింగ్ సూన్ అంటూ ప్రోమో వదిలారు మేకర్స్. సీజన్ సెవెన్ గ్రాంఢ్ హిట్ అవ్వడంతో ఈ సీజన్ పై మరింత ఆసక్తి పెరిగింది. ఇక ఆ అంచనాలకి తగ్గట్టుగానే బిబి టీమ్ లోగో ప్రోమోని రిలీజ్ చేశారు.

సీజన్ 8 లోగో కాస్త డిఫరెంట్‌గా ఉంది. మునుపటి సీజన్ లోగోలతో పోలిస్తే కలర్‌ఫుల్‌గా డిజైన్ చేశారు. ఇక 8 నంబర్ మధ్యలో 'స్టార్' సింబల్ ఉండటం విశేషం. ఇక ఈ లోగో ప్రోమోలో సీజన్ 8 త్వరలోనే అంటూ చెప్పింది స్టార్ మా. ఉల్టా పుల్టా పేరుతో వచ్చిన ఈ సీజన్‌లో పలు మార్పులు చేసి ఎలాగోలా ఆడియన్స్‌ను తిరిగి ఆకట్టుకుంది. సీజన్ 7లో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ విజేత అయితే సీరియల్ యాక్టర్ అమర్‌దీప్ రన్నరప్‌గా నిలిచాడు. గతేడాది డిసెంబర్‌లో సీజన్ 7కి శుభం కార్డు పడింది. అప్పటి నుంచి సీజన్ 8 ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అంతా ఎదురుచూశారు. తాజాగా బిబి‌ టీమ్ వారందరికీ శుభవార్త చెబుతూ సీజన్ 8 ప్రోమో రిలీజ్ చేసింది.

ప్రస్తుతం అనసూయ, శేఖర్ మాస్టర్ కలిసి చేస్తోన్న కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ ప్రతీ ఆదివారం వస్తుంది. ఇది పూర్తి అయిన తర్వాత బిగ్ బాస్ సీజన్ 8 మొదలవుతుందని తెలుస్తోంది. మరి కంటెస్టెంట్స్ లిస్ట్ గురించి ఇప్పటికే కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి‌. సోషల్ మీడియా ఇన్ ప్లూయన్సర్ ఫార్మర్ నేత్ర, సీరియల్ నటి అంజలి పవన్, అక్షిత, రీతూ చౌదరి, యాంకర్ వర్షిణి, యాంకర్ వింధ్య విశాఖ, ఇంద్రనీల్, తేజస్విని గౌడ, యాదమ్మ రాజు, వేణుస్వామి, బర్రెలక్క, యూట్యూబర్ నిఖిల్, సుప్రీత, సంచిక్ బబ్లూ, కుమారి ఆంటీ, ఏక్ నాథ్ హారిక వీళ్ళు బిబి టీమ్ లిస్ట్ లో ఉన్నట్టు తెలుస్తోంది. మరి వీరిలో ఎవరు హౌస్ లోకి ఎంటర్ అవుతారు? లేదంటే కొత్తవాళ్ళు ఇంకెవరైనా వస్తారా లేదా తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే.