English | Telugu
గర్ల్ ఫ్రెండ్ బొక్క.. అవే వస్తాయి.. తమన్ జీవిత పాఠాలు
Updated : Jul 16, 2024
ఆహా ఇండియన్ ఐడల్ సీజన్ 3 ఈ వారం ఫుల్ ఎంటర్టైనింగ్ గా సాగింది. ఇందులో ఎలిమినేషన్ రౌండ్ 2 లో యంగెస్ట్ సింగర్ రావుల భరత్ రాజ్ మీద జడ్జెస్ థమన్, కార్తిక్ కలిసి కాసేపు జోక్స్ వేసి నవ్వించారు. భరత్ పాడిన సాంగ్ మీద కొన్ని కరెక్షన్స్ చెప్పాక "భరత్ నువ్వు చూడడానికి ఏఐలా ఉన్నావు. ఎం చెప్పాలో తెలీట్లేదు..ఇది కాంప్లిమెంట్ భరత్. నువ్వు చాలా ఈజీగా ఏ పాటైనా కానీ పాడేస్తున్నావ్. నీ ఫేస్ లో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేదు . ఫైనల్లీ గీతా చెప్పింది నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందని అప్పుడు నువ్వు నవ్వావ్..దాంతో నువ్వు ఏఐ కాదు హ్యూమన్ బీయింగ్ అని అర్ధమయ్యింది." అని చెప్పేసరికి అందరూ నవ్వేశారు. తర్వాత థమన్ మాట్లాడాడు.
"నువ్వింకా బాగా మెచ్యురిటీతో పాడాలి. నీకు ఇంకా టైం ఉంది. గర్ల్ ఫ్రెండ్ బొక్క ఇవన్నీ వద్దు ఇప్పుడు..మ్యూజికల్ గా గెలువు...ఆటోమేటిక్ గా అవే వస్తాయి లైఫ్ లోకి." అంటూ కొన్ని జీవిత పాఠాలు చెప్పారు. ఇక ఆడియన్స్ కార్తీక్ ని ఒక ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్నని గీతా అడిగింది. కార్తిక్ పాడిన సాంగ్స్ లో "ఒక మారు...అరెరే ...నిజంగా నేనేనా" ఈ సాంగ్స్ లో ర్యాంక్స్ ఇమ్మని "అడిగేసరికి "అది కష్టం కానీ చెప్తా.. నా కన్సర్ట్స్ అన్ని కూడా ఒక మారు సాంగ్ తో స్టార్ట్ చేస్తా, తర్వాత నిజంగా నేనేనా అనే సాంగ్ సెకండ్ ప్లేస్" అని చెప్పాడు కార్తీక్.