English | Telugu
Karthika Deepam2 : పెళ్ళి ఆపడానికి కార్తిక్ ప్రయత్నం.. జ్యోత్స్న అర్థం చేసుకోగలదా!
Updated : Jul 16, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -97 లో... కార్తీక్ ఇంట్లోకి వస్తుంటే. రండి కాబోయే పెళ్లికొడుకు గారు అని కాంచన అంటుంది. వచ్చే వారం నిశ్చితార్థం అంట కదా.. ఇప్పుడు పిన్ని కాల్ చేసి చెప్పిందని కాంచన అంటుంది. ఇంట్లో నాన్న లేడా అని కార్తీక్ అడుగుతాడు. లేడు ఎందుకు అని కాంచన అంటుంది. పెళ్లి గురించి మాట్లాడడానికి అని కార్తీక్ అంటాడు. నిశ్చితార్థం అయ్యాక వెంటనే పెళ్లి ఉంటుందని కాంచన అనగానే.. నిశ్చితార్ధం ఆపాలని కార్తీక్ అంటాడు. ఇప్పటికే బిజినెస్ గురించి లేట్ చేసావని, నీపెళ్లి నా చేతులు మీదుగా చెయ్యాలని ముచ్చటపడుతున్నానని కాంచన అనగానే.. కార్తీక్ ఏం మాట్లాడలేకపోతాడు.
మరొకవైపు దీప వంట చేసి శౌర్యకి భోజనం తీసుకొని వస్తుంది. కానీ శౌర్య అలిగి కూర్చొని ఉంటుంది. నన్ను అమ్మమ్మ దగ్గరకి వెళ్ళనివ్వలేదని శౌర్యా అంటుంది. ఇప్పుడు మనం ఆ ఇంట్లో ఉండడం లేదు కదా అని దీప అంటుంది. కార్తీక్ దగ్గర కి తీసుకొని వెళ్లట్లేదు.. కార్తీక్ దారిలో కన్పిస్తే కూడా మాట్లాడనివ్వలేదని శౌర్య అంటుంది. నువ్వు స్కూల్ కి వెళ్ళాలని దీప అనగానే.. నేను వెళ్ళనంటూ శౌర్య కోపంగా అక్కడ నుండి వెళ్లిపోతుంది. మరొకవైపు ఎందుకురా దాని జోలికి వెళ్లి దెబ్బలు తింటావా అని నర్సింహాపై అనసూయ కోప్పడుతుంది .మరి మా చుట్టాల పిల్లని పెంచుకోవాలా అని శోభ అనగానే.. వద్దు నేను నా మనవరాలిని తెచ్చుకుంటా అని అనసూయ అంటుంది.
ఆ తర్వాత సుమిత్ర వాళ్ళు కార్తీక్ జ్యోత్స్నల ఎంగేజ్ మెంట్ గురించి మాట్లాడుకుంటారు. మరొకవైపు శౌర్యకి దీప అన్నం తినిపిస్తూ.. జ్యోత్స్న, కార్తీక్ కి ఎంగేజ్ మెంట్ అంట, సుమిత్ర గారు చెప్పారని అనగానే.. మనం వెళ్తున్నామా అని శౌర్య అంటుంది. మరొకవైపు జ్యోత్స్నకి అర్థం అయేటట్టు.. నేను చెప్పాలా అని కార్తీక్ అనుకుంటాడు. మళ్ళీ వద్దులే అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.