English | Telugu

Guppedantha Manasu:ఆ మూడవ మనిషి భద్రేనని డౌట్.‌. నువ్వు ఎండీ అయ్యాకే ఇవన్నీ గొడవలు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -987 లో.. శైలేంద్ర తెలివిగా తప్పించుకున్న సంఘటన గుర్తుకు చేసుకొని వసుధార ఆవేశంతో తన గదిలోని సామాన్లని కిందపడేస్తుంటే.. మహేంద్ర, అనుపమ ఇద్దరు కంగారుపడుతు వసుధార దగ్గరికి వస్తారు. అంత కోపంగా ఉన్న వసుధారని చూసి ఇద్దరు షాక్ అవుతారు. నాకు రిషి సర్ కావాలి మావయ్య అంటూ బాధగా మహేంద్ర దగ్గరికి వెళ్లి వసుధార అడుగుతుంది.

ఆ తర్వాత అసలు రిషిని ఆ శైలేంద్ర కిడ్నాప్ చెయ్యలేదని ముకుల్ అన్నట్లు నాక్కూడా అనిపిస్తుంది. ఎందుకంటే అతను ప్రోగ్రామ్ జరిగే దగ్గర మనతోనే ఉన్నాడని అనుపమ అంటుంది. దేవయాని వదిన అయ్యే ఛాన్స్ కూడా ఉండదు. ఎందుకంటే నేను ఫోన్ లో మాట్లాడినప్పుడు తను ఇంటిదగ్గరే ఉందని మహేంద్ర అంటాడు. ఇందులో మూడవ వ్యక్తి ఉన్నారు. ఎవరు అతను నా ఫోన్ లో వీడియో కూడా డిలీట్ చేసాడంటూ వసుధార ఆలోచనలో పడి ఒక్కసారిగా భద్ర అని అనగానే.. మహేంద్ర, అనుపమ లు షాక్ అవుతారు. వాళ్ళ మాటలన్ని భద్ర చాటుగా వింటు ఉంటాడు. ఆ తర్వాత భద్ర ఇదంతా చేసే అవకాశం ఉంది నా దగ్గరకి మొన్న అడ్రస్ తెలియకున్నా కనుక్కొని వచ్చాడు. ఎప్పుడు ఫోన్ మాట్లాడుతూనే ఉంటాడు. ఎవరంటే అర్థం లేకుండా సమాధానం చేప్తున్నాడని వసుధార అంటుంది. అదంతా విన్న భద్ర.. శైలెంద్రకి ఫోన్ చేసి తనపై డౌట్ వచ్చిన విషయం చెప్తాడు ఇక లేట్ చెయ్యకుండా ఆ వసుధారని లేపేయ్ అని చెప్తాడు. దానికి భద్ర ఓకే అంటాడు.

ఆ తర్వాత వసుధార ఒంటరిగా కూర్చొని.. ఇందాక తము మాట్లాడుకుంటున్నప్పుడు భద్ర కిటికీలో నుండి విన్నది వసుధార చూస్తుంది. ఆ విషయం గుర్తుకుచేసుకుంటుంది వసుధార. ఆ తర్వాత కాలేజీలో స్టూడెంట్స్ ని శైలెంద్ర రెచ్చగొడతాడు. రిషి సర్ కావాలని గొడవ చేస్తుంటారు స్టూడెంట్స్. అక్కడకి వసుధార, మహేంద్ర, అనుపమ, ఫణీంద్రలు వచ్చి సర్ది చెప్తారు. అయిన వాళ్ళు వినరు. ఆ తర్వాత మినిస్టర్ గారు వచ్చి.. ఏంటి ఈ గొడవలు రిషి సర్ వస్తారని అన్నావ్. తీసుకొని రాలేదు నువ్వు ఎండీగా ఉన్నప్పటి నుండే ఇవన్ని జరుగుతున్నాయంటు మినిస్టర్ గారు వసుధారపై కోప్పడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.