English | Telugu
పాత గాయాలను కెలకొద్దు...చిరంజీవి నా దేవుడు..నేను రిటైర్ అవ్వను
Updated : Jan 31, 2024
యాంకర్ రవి బుల్లితెర మీద హోస్టింగ్ చేస్తూనే అప్పుడప్పుడు మూవీస్ లో కూడా నటిస్తూ బిగ్ బాస్ 5 లోకి కంటెస్టెంట్ వెళ్ళాడు. అలాంటి రవి ఇప్పుడు స్మాల్ స్క్రీన్ మీద షోస్ కి, ఈవెంట్స్ కి హోస్టింగ్ చేస్తున్నాడు..అలాగే సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టీవ్ గా ఉంటున్నాడు. ఇక ఇప్పుడు "టైంపాస్..అడిగేయండి" అంటూ ఫాన్స్ ని పిలిచాడు.
ఇంకేముంది ప్రశ్నల మీద ప్రశ్నలు వచ్చేసాయి.."మీకు ఫ్రెండ్స్ అంటే ఎంతిష్టం" "విరాట్ కోహ్లీకి బాట్ అంటే , త్రివిక్రమ్ కి పెన్ అంటే, కుమారి ఆంటీకి ఫుడ్ పెట్టడం అంటే ఎంతిష్టమో నాకు ఫ్రెండ్స్ అంటే అంతిష్టం" అని చెప్పాడు. "చిరంజీవి గారిని దగ్గర నుంచి చూసినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది" "ఆయన్ని చూడడం నిజంగా అదృష్టం..ఆయనతో ఫోటో దిగేటప్పుడు ఆప్యాయంగా భుజం మీద చెయ్యి వేసి, మాట్లాడి ఇంకో 20 , 30 ఏళ్ళ వరకు పరిగెత్తే శక్తిని అందిచ్చారాయన..మీరు చేస్తారు కష్టపడండి అని మోటివేట్ చేశారు. ఆంజనేయ స్వామి, శివుడు ఎలా ఉంటారు అని కళ్ళుమూసుకుని చూస్తే చిరంజీవి గారే గుర్తొస్తారు.
ఆయన్ని దగ్గర నుంచి చూసేసరికి కన్నీళ్లు, గూస్ బంప్స్ వచ్చేసాయి." " ఎప్పుడూ షార్ట్స్, టిషర్ట్స్ లోనే కనిపిస్తావు" " ఎందుకంటే అవి నావి..వాటిల్లోనే నాకు ఎక్కువగా కంఫర్ట్ గా ఉంటుంది" "తేజస్విని గౌడ గురించి" "ఆమె కష్టపడుతుంది, కేరింగ్ గా ఉంటుంది, స్వీట్ హార్ట్" "వర్క్, ఫామిలీని ఎలా మానేజ్ చేస్తున్నావ్" "నేను వర్క్ ని మేనేజ్ చేస్తున్న ఫామిలీ నన్ను మానేజ్ చేస్తుంది" "సుమ గారి తర్వాత బెస్ట్ యాంకర్ ఎవరు" "నేనే" " అమర్ దీప్ గురించి ఒక్క మాటలో" "జెన్యూన్ గా ఉంటాడు" " రిటైర్మెంట్ ప్లాన్స్ ఏమిటి" "రిటైర్మెంట్ అంటూ ఏమీ లేదు..ఆఖరి ఊపిరి వరకు నా ఫుడ్ నేను సంపాదించుకోవాలి" "నెగటివ్ కామెంట్స్ పై నీ అభిప్రాయం" " చిల్లర కామెంట్స్ పెట్టేవాళ్లు కోసం అంతగా రియాక్ట్ అవ్వను" "అన్నా మీరు బిగ్ బాస్ గెలుస్తారని నేను మీకు ఓట్లు వేయలేదు" " ఎందుకమ్మా ఇంకా ఆ పాత గాయాలను కెలుకుతారు..గతం గతః" "ఇప్పటికీ మేము పటాస్ షో చూస్తున్నాం" "మీరు కూడానా..ఎప్పుడైనా డల్ గా అనిపించినప్పుడు నేను కూడా చూస్తాను" అంటూ ఎన్నో ప్రశ్నలకు ఠకీఠకీమని ఆన్సర్స్ ఇచ్చాడు రవి.