English | Telugu

రేవంత్ వర్సెస్ గీతు!


బిగ్ బాస్ హౌస్ లో సోమవారం జరిగిన నామినేషన్ ప్రక్రియ ఉత్కంఠభరితంగా సాగింది. కంటెస్టెంట్స్ మధ్య మాటలు ఒక మినీ యుద్ధాన్ని తలిపించేలా కొనసాగాయి. అందులో రేవంత్, గీతుకి మధ్య సాగిన మాటల యుద్ధం హౌస్ ని హీట్ చేసేసిందనే చెప్పాలి.

కాగా ఈ సారి నామినేషన్ ప్రక్రియ పేరు 'ఫైర్ నామినేషన్ ', అంటే ఒక ఫైర్ లో, మీకు ఎవరు తక్కువగా పర్ఫామెన్స్ ఇచ్చారో వారి ఫోటోని ఆ ఫైర్ లో వేసి నామినేట్ చేయాలని బిగ్ బాస్ చెప్పాడు. అందులో రేవంత్, గీతుని నామినేట్ చేసాడు. నామినేషన్ కి గల‌ కారణం చెప్తూ, "నేను పెరుగు దొంగని అని అన్నావ్. అది బయట వేరేలా పోర్ట్ రేట్ అవుతోంది. నేను ఏం దొంగతనం చేయలేదు." అని రేవంత్ అనగా "అది కాదు రేవంత్ నా కళ్ళతో చూసా నువ్వు పెరుగు తినడం" అని గీతు అనగా, "ఫస్ట్ నేను చెప్తున్నా కదా విను‌.
పెరుగంతా నువ్వు తినేస్తున్నావ్ అని అనడం తప్పు, నేను దొంగతనం చేసేది చేసినట్టు ఒక్కరితో చెప్పించు" అని రేవంత్, గీతుతో అన్నాడు. దానికి కీర్తిభట్ మద్యలో లేచి," చపాతీ వేసుకొని పాలు పోసుకొని తాగావ్ . నేను చూసాను. నువ్వు దొంగతనం చేసావ్." అని కీర్తి భట్ అనగా, "కూర్చో మధ్యలో అని రేవంత్ అన్నాడు."

రేవంత్, గీతూతో మాట్లాడుతూ, " నువ్వు రూల్స్ ఫాలో అవ్వవు. నీ స్ట్రాటజీలతో ఎదుటివాళ్ళను తప్పు అంటావ్ కానీ నువ్వు రాంగ్" అని చెప్పాడు. దానికి గీతు సమాధానంగా, " నువ్వు నాకు రూల్స్ గురించి చెప్పడం కామెడీగా ఉంది. నువ్వు పడుకుంటే ఎన్నిసార్లు కుక్కలు మొరిగాయో హౌస్ మేట్స్ అందరికీ తెలుసు. నీతో మాట్లాడటం కూడా వేస్ట్ " అని గీతు అంది. ఆ తర్వాత 'యూ ఆర్ నతింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ' అని గీతు అనగా, "నా ముందు నువ్వు నతింగ్" అని రేవంత్ చెప్పాడు. ఆ తర్వాత "ఏం పీకుతావ్" అని రేవంత్ అనగా, "రా ఏం పీకుతానో లేదో తెలుస్తుంది" అని గీతు అంది. ఇలా గీతుకి రేవంత్ కి మధ్య మాటల యుద్ధం ముగిసింది. ఇక ముందు చూడాలి వీళ్ళు హౌస్ మేట్స్ లా ఉంటారో? లేదో? చూడాల్సి ఉంది.