English | Telugu

మెరీనాని టార్గెట్ చేసిన హౌస్ మేట్స్!

మెరీనా బిగ్ బాస్ హౌస్ లో వచ్చినప్పటి నుండి టాస్క్ లలో తన పర్ఫామెన్స్ అంతగా ఏమీ లేదనే చెప్పాలి. ఇప్పటికి చాలా వారాలు అయిన గేమ్ ఇంకా మొదలు పెట్టలేదు అని మొదటి నుండి చూస్తూన్న ప్రేక్షకులకు స్పష్టంగా తెలుస్తోంది. అయితే జంటగా వచ్చిన ఈ మెరీనా-రోహిత్ విడదీసి ఇండివిడ్యువల్ గేమ్ ని ఆడమన్నాడు బిగ్ బాస్. అయితే ఇండివిడ్యువల్ గా తన పర్ఫామెన్స్ అంతలా ఏమీ లేదని, గత వారంలో మోస్ట్ అన్ డిసర్వింగ్ గా పేరు తెచ్చుకొని, నామినేషన్ లో ఉంది మెరీనా. అయితే హౌస్ లో దాదాపు సగంకి పైగా హౌస్ మేట్స్ తననే నామినేట్ చేయడంతో అందరికి తన పర్ఫామెన్స్ తక్కువగా తెలిసి, అందరికి తనే టార్గెట్ అయింది అని చెప్పాలి. మొదటగా శ్రీసత్య, మెరీనాని నామినేట్ చెయ్యగ. " ఏ విషయం అయినా క్లియర్ గా చెప్పాలి" అని మెరీనా అనగా "చెప్తేనే కదా తెలిసేది" అని శ్రీసత్య చెప్పింది

"నువ్వు చేసిన ఫూలిష్ నెస్ వల్ల మన టీం లో ఉన్న వాళ్ళు అయోమయంలో ఉన్నారు. రాత్రి ఒక మాట చెప్పవ్. మళ్ళీ పొద్దున్నకి వేరే మాట అన్నావ్. నీ ఆలోచన వేరే లెవల్ లో ఉంది. నువ్వు నీ మాట మీద ఉండలేవు. నైట్ ఒక మాట మీద ఉన్నావ్ .తెల్లారేసరికి మాట మార్చేసావు" అని మెరీనా, శ్రీసత్య తో చెప్పుకొచ్చింది. తర్వాత ఆదిరెడ్డి, మెరీనాని నామినేట్ చేసాడు. "నువ్వు ఇంకా గేమ్ ఆడట్లేదు" అని ఆదిరెడ్డి అనగా, "నా గేమ్ నాకు క్లారిటీ ఉంది. నేను ఆడుతున్నాను. ఎవరు జడ్జ్ చేయనవసరం లేదు" అని మెరీనా అంది. ఆ తర్వాత వచ్చిన గీతు, మెరీనాని నామినేట్ చేసింది. "ఈ హౌస్ లో మొన్న జరిగిన గేమ్ లో 'లీస్ట్ పెర్ఫార్మన్స్' ఎవరు అంటే నువ్వు అని నాకు అనిపించిది. ఎందుకంటే నీ గేమ్ నాకు ఎక్కడా కూడా కనిపించలేదు" అని గీతు చెప్పింది. "నేను గేమ్ పరంగా బానే ఆడాను" అని మెరీనా సమాధానమిచ్చింది.

ఆ తర్వాత వచ్చిన ఫైమా కూడా మెరీనాని నామినెట్ చేసింది. ఫైమా వెటకారంగా మాట్లాడిన తీరుకి మెరీనా బాధపడినట్టుగా అనిపిస్తోంది. ఆ తర్వాత శ్రీహాన్, మెరీనా ని నామినేట్ చేసాడు. ఇలా హౌస్ లో ఎక్కువ మంది నామినేట్ చెయ్యడంతో మెరీనా ఏడ్చేసింది. తనని అలా చూసిన రోహిత్ సర్దిచెప్పే ప్రయత్నం చేసాడు. కాగా ఈ వారం లో అయిన మెరీనా టాస్క్ లో బాగా పర్ఫామెన్స్ చేసి అటు హౌస్ మేట్స్ ని మెప్పించి, ఇటు ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ఇస్తుందో? లేదో? చూడాలి మరి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.