English | Telugu
సుమన్ శెట్టికి వేలు చూపించి మాట్లాడిన కళ్యాణ్.. ఖతం టాటా బైబై!
Updated : Nov 18, 2025
ఏది జరగకూడదని కళ్యాణ్ ఫ్యాన్స్ అనుకున్నారో అదే జరిగింది. బిగ్ బాస్ సీజన్-9 లో స్ట్రాంగ్ ఓట్ బ్యాకింగ్ ఉన్న కంటెస్టెంట్ ఎవరైన ఉన్నారంటే అది సుమన్ శెట్టి.. కళ్యాణ్ పడాల తన లిమిట్స్ దాటి సుమన్ శెట్టికి వేలు చూపించి మాట్లాడు.. ఇది ఇప్పుడు ఫుల్ హాట్ టాపిక్ గా మారింది. సుమన్ శెట్టి ఫ్యాన్స్ అంతా కలిసి కళ్యాణ్ పడాల మీద నెగెటివ్ ట్రోల్స్ చేస్తారు ఇక. ఎందుకంటే ఇప్పటివరకు సుమన్ శెట్టి గేమ్స్ ఆడకపోయినా అతను నామినేషన్లోకి వచ్చాడంటే అతడే టాప్ లో ఉంటాడు. కళ్యాణ్ ఇక టాటా బైబై .. అన్నీ సర్దుకోవాల్సిందే.. అక్కడ ఉంది డీర్ కాదు డైనోసార్ అని తెలియదు పాపం ఈ అమూల్ బేబీ కళ్యాణ్ కి.. ఇక అతనికి ఓటింగ్ కూడా కష్టమే.
పదకొండవ వారం నామినేషన్ల ప్రక్రియలో భాగంగా కంటెస్టెంట్స్ మధ్య ఫుల్ హీటెడ్ ఆర్గుమెంట్స్ జరిగాయి. భరణి, ఇమ్మాన్యుయల్, డీమాన్ పవన్, దివ్య రీతూని నామినేట్ చేయగా తనూజ తనకున్న స్పెషల్ పవర్ ఉపయోగించి రీతూని సేవ్ చేసింది. ఆయితే నామినేషన్లో దివ్య వర్సెస్ రీతూ ఒకటి ఫుల్ హైప్ అవ్వగా.. సంజన వర్సెస్ రీతూ నామినేషన్, భరణి వర్సెస్ ఇమ్మాన్యుయల్ నామినేషన్ లు హైలైట్ గా నిలిచాయి. ఇక అందరి నామినేషన్లు ముగిసాక.. చివరగా ఒకే ఒక్క నామినేషన్ మిగిలి ఉండటంతో ఆ టోకెన్ ని సుమన్ శెట్టికి ఇచ్చింది తనూజ.
సుమన్ శెట్టి వచ్చి తన పాయింట్లు చెప్పి పవన్ కళ్యాణ్ ని నామినేట్ చేశాడు. ఆయితే ఈ నామినేషన్ లో ఇద్దరి మధ్య డిస్కషన్ సాగింది. టవర్ టాస్క్‌లో వరస్ట్ సంచాలక్‌గా చేసావ్.. నేను కెప్టెన్ కాలేకపోయాను.. నువ్వు గేమ్ ముందు కరెక్ట్ గా చెప్పలేదు అని సుమన్ శెట్టి చెప్పి కళ్యాణ్‌ని నామినేట్ చేశాడు. టవర్ స్ట్రైట్‌గా ఉండాలని ముందు చెప్పలేదని సుమన్ అంటే.. మీరిద్దరు సేమ్ పెడతారని నాకెలా తెలుసు.. నాకేమైనా కల వస్తుందా అని కళ్యాణ్ వాగాడు. దాంతో సుమన్ శెట్టికి కోపం వచ్చింది. వినూ.. వినూ.. వినూ.. ఇవ్వే వద్దు అని సుమన్ శెట్టిని కళ్యాణ్ వేలు చూపించి ఫుల్ కోపంగా అన్నాడు. వేలు దించూ.. ఆ వేలు కిందికి దింపు అని సుమన్ శెట్టి అన్నాడు. వేలు నీ వైపు చూపించడం లేదని కళ్యాణ్ అనడంతో.. నా వైపు చూపించావ్ కాబట్టే చెప్తున్నాను.. సుమన్ శెట్టి ఆవేశంగా వెళ్లి కళ్యాణ్ కుండని ముక్కలు ముక్కలు చేశాడు. అతని ఆవేశం చూసి ఇమ్మాన్యుయల్, భరణితో పాటు అందరు భయపడి పక్కకి వెళ్లారు.