English | Telugu
Bigg Boss 9 Nominations 11th Week: చెత్త రీజన్ తో దివ్యని నామినేట్ చేసిన రీతూ!
Updated : Nov 18, 2025
బిగ్ బాస్ సీజన్-9 లో పదకొండవ వారం నామినేషన్ల ప్రక్రియ యమజోరుగా సాగింది. ఇందులో భాగంగా ఇమ్మాన్యుయల్ వర్సెస్ భరణి నామినేషన్ హైలైట్ కాగా రీతూ వర్సెస్ దివ్య నామినేషన్ హౌస్ లో హీట్ ని పెంచేసింది.
భరణి, ఇమ్మాన్యుయల్ , డీమాన్ పవన్ ముగ్గురు రీతూని నామినేట్ చేస్తే తను మాత్రం సంజన, దివ్యలని నామినేట్ చేసింది. అయితే వారిని నామినేట్ చేసి రీతూ చెప్పిన రీజన్లు మాత్రం మరీ చెత్తగా ఉన్నాయి. నువ్వు రాజు, రాణి టాస్క్ లో నన్ను తక్కువ చేసి నిన్ను నువ్వు ఎక్కువ చేసుకొని మాట్లాడావంటూ రీజన్ చెప్పింది రీతూ. అయిబాబోయ్ నీకు అది అర్థం కాదు.. అక్కడ మ్యాటర్ ఏంటంటే.. కళ్యాణ్ కి ఛాన్స్ వచ్చింది. తను ఏం అన్నాడంటే ఇద్దరు ఈక్వల్ గా గేమ్స్ ఆడారు అని డైలామాలో ఉన్నాడు. అయితే దానికి నేను వివరణ ఇచ్చాను.. నేను నీకంటే ఎందుకో బెటర్ అని వివరించే అంతే అని వ్యాలిడ్ రీజన్ ఇచ్చింది దివ్య. అయితే రీతూ మాత్రం అది వదిలేసి.. ఇష్టమొచ్చినట్టు మాట్లాడి దివ్యని రెచ్చగొట్టింది.
ఆ తర్వాత రీతూని దివ్య నామినేట్ చేసింది. ఇది నా నామినేషన్ నేను చెప్పినప్పుడు నువ్వు వినాలి అని దివ్య అంది. ఏ అలాగని ఇక్కడేమైనా రూల్ ఉందా అని రీతూ అనగా.. హా.. నా నామినేషన్.. ఇది నా రూల్ అని దివ్య అంది. నువ్వు చెప్పేది విను ఫస్ట్..ఆ తర్వాత డిఫెండ్ చేసుకో అని దివ్య అంది. ఇక రీతూ వాగుతూనే ఉంది. నువ్వు నన్ను తొక్కి తొక్కి తొక్కి ఎంతసేపు తొక్కుతావని రీతూ జుట్టు పీక్కుంది. దాంతో దివ్య కోపంగా వచ్చి.. రీతూ చౌదరి కుండని గట్టిగా ఒకేసారి కొట్టి ముక్కలు ముక్కలు చేసింది. అది చూసి హౌస్‌లోని మిగతా వాళ్లంతా షాక్ అయిపోయారు. ముఖ్యంగా భరణి అయితే ఏంట్రా బాబు ఈ ఫైర్ అన్నట్టుగా చూశాడు. అయితే ఇందులో దివ్య పాయింట్లు చెప్పిన రీజన్లు అన్నీ కరెక్ట్ గా ఉన్నాయి కానీ రీతూ చెప్పినవేమీ వ్యాలిడ్ గా లేవు. వీరిద్దరి నామినేషన్ లో ఎవరు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.