English | Telugu
హీరోగా దేవి శ్రీ ప్రసాద్...ఆ డైరెక్టర్ ఎవరో తెలుసా!
Updated : Oct 29, 2025
జయమ్ము నిశ్చయమ్మురా నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. దీనికి డిఎస్పీ వచ్చాడు. రాగానే జగపతి బాబు ఇంటరెస్టింగ్ ప్రశ్నలు అడిగారు. "గోవాలో నేను కాండిల్ లైట్ డిన్నర్ ఫోన్ ల మీద ఫోన్ లు అన్ని ఫోన్ లా" అని జగపతి బాబు అడిగేసరికి "తర్వాత మాట్లాడుకుందాం సర్" అన్నాడు డిఎస్పీ. "ఆ మాయ ఏంటి ఆ మాయ ఎవరు" అని జగ్గు భాయ్ అడిగేసరికి" "మాయ ఓ మాయ" అంటూ డిఎస్పీ పాట పాడాడు. "ఎన్ని లవ్ స్టోరీస్ ఉంటే అన్ని బ్రేకప్స్ ఉంటాయి కదా" అని జగపతి బాబు అన్నారు. "లవ్ సాంగ్స్, బ్రేకప్ సాంగ్స్ తెలిసీ తిలేకుండా చేసేశాం సర్" అని చెప్పాడు డిఎస్పీ. "మై లవ్ ఈజ్ గాన్" అంటూ బ్యాక్ గ్రౌండ్ లో సాంగ్ ప్లే అయ్యింది. తర్వాత కళ్లద్దాలు తీసేసాడు డిఎస్పీ. "కళ్ళజోడు తీసెసావుగా ఇక ఎక్స్ప్రెషన్స్ చక్కగా కనబడిపోతాయి" అన్నారు జగపతి బాబు.
"గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది" అనే సాంగ్ పాడి వినిపించాడు డిఎస్పీ. "పెళ్లి గురించి కూడా పాటల్లోనే చెప్పేసావ్" అని జగ్గు భాయ్ అడిగారు. "వద్దురా సోదరా అరె పెళ్లంటే నూరేళ్ళ మంటరా" అనే సాంగ్ ప్లే అయ్యింది. "ఫస్ట్ హీరో అవుతావా పెళ్లి చేసుకుంటావా..ఏదో ఒక ఆప్షన్ " అని అడిగారు జగ్గు భాయ్. "ఈ ఎపిసోడ్ మా అమ్మగారికి బాగా నచ్చుద్ది" అన్నాడు డిఎస్పీ. డిఎస్పీ అంటే చాలు దేవి శ్రీప్రసాద్. ఎన్నో హిట్ సాంగ్స్ కి కేరాఫ్ అడ్డా. ఐతే ఇప్పుడు ఆ హవా కొంచెం బ్రేక్ పడింది. ఐతే ఒక మూవీలో హీరోగా రాబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. మరి డిఎస్పీ ఇంకా ఎలాంటి ఇంటరెస్టింగ్ విషయాలను చెప్పాడో ఎపిసోడ్ లో చూసి తెలుసుకోవాలి.