English | Telugu

అయ్యో పింకీ..ఎంత పని అయ్యింది...


జబర్దస్త్ లో ట్రాన్స్జెండర్ కమెడియన్ గా క్లిక్ ఐన పింకీ తన లైఫ్ లో అనుక్షణం కష్టాలు పడుతూనే ఉంటుంది. తన జీవితంలో ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నట్లు రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పింది. అలాంటి పింకీ కొంత కోలుకుని లైఫ్ లో సెటిల్ అయ్యి షోస్, ఈవెంట్స్ చేస్తూ ఉన్న ఈ టైములో ఆమెకు జీ తెలుగులో సూపర్ జోడి ఆఫర్ వచ్చింది. ఐతే ఈ వారం షోకి ఆమె అటెండ్ కాలేదు. ఐతే పింకీ తాను అసలు ఈ ఎపిసోడ్ కి ఎందుకు రాలేదు అనే విషయం గురించి చెప్తూ తన యూట్యూబ్ ఛానల్ లో ఒక వీడియోని పోస్ట్ చేసింది. తాను చేసిన తప్పు మరెవ్వరూ చేయకూడదు అంటూ అందులో చెప్పింది. బాడీ మొత్తం డిహైడ్రేట్ ఐపోయి బ్లడ్ ఇన్ఫెక్షన్ , యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చిందని బాధపడింది.

వైరల్ ఫీవర్ సివియర్ గా రావడం వలన ప్లేట్లెట్స్ కూడా బాగా తగ్గిపోయాయని చెప్పి తన హాస్పిటల్ బెడ్ మీద నుంచి ఈ డీటెయిల్స్ అన్నీ చెప్తూ వీడియో చేసింది. ఆమె పరిస్థితి చూసిన నెటిజన్స్ చాలా బాధపడుతున్నారు. ఐతే తన డాన్స్ టీమ్ అంతా తన కోసం ఎదురు చూస్తోందని ఎలాగైనా ఓపిక తెచ్చుకుని డాన్స్ ప్రాక్టీస్ చేయాలనీ కోరుకుంది పింకీ. ఐతే తన హెల్త్ గురించి కాజల్, యాంకర్ శివ, వాళ్ళ డైరెక్టర్, సిరి హన్మంత్ అంతా ఇంటికి వచ్చి ఎప్పటికప్పుడు చూస్తున్నారని చెప్పింది. ఇక ప్రాక్టీస్ కి కూడా హెల్త్ సపోర్ట్ చేయకపోయేసరికి హాస్పిటల్ అడ్మిట్ అయ్యింది పింకీ. టెస్టులన్నీ అయ్యాక లివర్ ఇన్ఫెక్షన్ అన్న విషయం చెప్పారట డాక్టర్లు. ఐతే వరసగా రెస్ట్ లేకుండా ఇరవై రోజుల నుంచి డాన్స్ ప్రాక్టీస్ చేయడం వలన, ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ వాడడం వలన ఇంతవరకు వచ్చిందని చెప్పింది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆరోగ్యంగా ఉండాలంటూ అందరికి ఒక మెసేజ్ ఇచ్చింది. ఎందుకంటే ఏ ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్లినా కూడా 100 లతో కానీ 1000 లతో కానీ ఐపొవట్లేదు. లక్షలు ఖర్చైపోతున్నాయి. కాబట్టి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. వాటర్ ఎక్కువగా తాగండి. డాక్టర్ సలహా లేకుండా ఎలాంటి మెడిసిన్ వాడకండి అని చెప్పింది పింకీ. ఆమె బాధను చూసిన నెటిజన్స్ మాత్రం మంచి వాళ్లకు ఆ దేవుడు అంతా మంచే చేస్తాడు. గెట్ వెల్ సూన్ అక్కా అంటూ వాళ్ళు అభిమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.