English | Telugu

బిగ్ బాస్ హౌస్ లో తెగ సందడి చేస్తూ శుభశ్రీ


శుభశ్రీ రాయగురు బిగ్ బాస్ హౌస్ లో తెగ సందడి చేస్తోంది.. టేస్ట్ తేజతో కలిసి ఒకవైపు, మరో వైపు స్విమ్మింగ్ పూల్ టాస్క్ లో పల్లె ప్రశాంత్ ని కవ్విస్తూ మరో వైపు. శుభశ్రీని శుభ అని కొందరు, సుబ్బు అని హౌస్ లో పిలుస్తున్నారు. ఈమె మోడలింగ్ తో తన కెరీర్ స్టార్ట్ చేసింది. VLCC ఫెమినా మిస్ ఇండియా ఒడిశా 2020 టైటిల్‌ను గెలుచుకుంది. తర్వాత నటిగా జర్నీ స్టార్ట్ చేసి మూవీస్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తోంది. కోలీవుడ్ లో డెవిల్ మూవీతో సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు. హీరోయిన్ గా "రుద్రవీణ, కథ వెనుక కథ" లాంటి కొన్ని మూవీస్ లో నటించింది కానీ పెద్దగా పేరు రాలేదు ఈ అమ్మడుకి. కళ్యాణ్ రామ్ "అమిగోస్|" మూవీలో సినిమాలో పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా నటించింది.

అలాగే తమిళ్ సీరియల్స్ లో నటించి ఆడియన్స్ కి బాగా దగ్గరై గుర్తింపు తెచ్చుకుంది శుభశ్రీ. ప్రస్తుతం సీరియల్స్, మూవీస్ లో క్యారెక్టర్స్ చేసుకుంటూ వెళ్తోంది. నటిగా, మోడల్‌గా, లాయర్‌గా, డ్యాన్సర్‌గా, యాంకర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ తెరకెక్కిస్తున్న "ఓజి" లో ఒక ముఖ్యమైన పాత్ర చేస్తున్నట్లు చెప్పింది. ఐతే ఆ మూవీలో తన రోల్ ఏమిటో చెప్పకుండా సస్పెన్సు లో పెట్టింది. పవన్ కళ్యాణ్ తో కలిసి నటించడం చాలా సంతోషంగా ఉందని రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో చెప్పింది. ఆయన యాటిట్యూడ్ చాలా డిఫరెంట్ అని కళ్లలోనే పవర్ ఉంటుందని చెప్పింది శుభశ్రీ.. మరి అలాంటి సుబ్బు హౌస్ లో ముందుముందు ఎలా ఆడుతుంది ఎన్ని వీక్స్ ఇంట్లో ఉంటుందో చూడాలి.