English | Telugu
ఇంద్రసేనా రెడ్డా..ఇరిగిపోయిన ఇడ్లీనా
Updated : Sep 9, 2023
ఢీ ప్రీమియర్ లీగ్ ప్రతీ వారం మంచి జోష్ తో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ వస్తోంది. నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో ఆది ఇంద్రసేనా రెడ్డి గెటప్ లో వచ్చి కాసేపు డైలాగ్స్ తో దుమ్ము రేపాడు "రాననుకున్నారా., రాలేననుకున్నారా" అనేసరికి "రాకుండా ఉంటే బాగుందనుకున్నాం" అంటూ శేఖర్ మాస్టర్ సెటైర్ వేశారు. దానికి ఆది నవ్వేసరికి డోర్ తెరుచుకుని జబర్దస్త్ యాంకర్ సౌమ్య శారద ఎంట్రీ ఇచ్చింది.."ఇంద్రసేనా రెడ్డినా ..ఇరిగిపోయిన ఇడ్లీలా ఉన్నారు" అని కౌంటర్ ఇచ్చింది.
ఇక ఈ షోలో నెల్లూరు నెరజాణలు టీమ్ ట్రాన్స్జెండర్స్ గెటప్స్ తో వచ్చి "బోలా శంకర్" మూవీ నుంచి సాంగ్ కి డాన్స్ పెర్ఫార్మ్ చేశారు. తర్వాత స్టేజి మీదకి ప్రాచి రాథోడ్ అనే ట్రాన్స్ జెండర్ వచ్చి కాసేపు మాట్లాడారు.. "నాకు చాలా హ్యాపీగా ఉంది..మా కమ్యూనిటీ కూడా ఏ రంగంలో ఐనా కూడా రిప్రెజెంటేషన్ ఇస్తోంది..నాకంటూ నేను గవర్నమెంట్ సెక్టార్ లో ఒక జాబ్ సెక్యూర్ చేసుకోగలిగాను" అని చెప్పేసరికి అందరూ ఆమెను విష్ చేశారు. ఇక శేఖర్ మాస్టర్ ఆమెతో డాన్స్ స్టేజి షేర్ చేసుకుని డాన్స్ చేశారు. ఇక ఫైనల్ గా శోభితా స్టేజి మీదకు వచ్చేసరికి "శోభితా ఆర్ యు హ్యాపీ" అనేసరికి ఆమె ఏడ్చేసింది. ఇంతకు ఎందుకు ఏడ్చిందో అర్ధం కాలేదు. మరి వాళ్ళ టీమ్ సరిగా పెర్ఫార్మ్ చేయలేదని ఏడ్చిందా అనేది అర్ధం కాలేదు. అలాగే ఈ వారం షోకి దీపికా పిల్లి ఎంట్రీ ఇవ్వలేదు. దాంతో ఆమె ఫాన్స్ కూడా చాలా హర్ట్ అయ్యారు. ఎందుకు రాలేదా అని ఆరా తీస్తున్నారు.