English | Telugu

నాన్న జీరో అంటూ ఏడ్చేసిన శుభలేఖ సుధాకర్

అమ్మంటే ఎంత ఇష్టమో నాన్న అన్నా కూడా అంతే ఇష్టం ఉంటుంది ఎవరికైనా. అమ్మ తొమ్మిది నెలలు మోస్తే నాన్న జీవితాంతం తన భుజాలపై మోస్తాడు. జూన్ లో ఫాదర్స్ డే రాబోతోంది. ఇక ఈ నెలలోనే మ్యూజిక్ డే కూడా వుంది. సంగీతం లేని ప్రపంచాన్ని ఊహించలేం. మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలన్నా, మంచి నిద్ర పట్టాలన్నా, స్పెషల్ మూమెంట్స్ ని ఎంజాయ్ చేయాలన్నా మ్యూజిక్ కి ఆల్టర్నేట్ ఇంకోటి లేదు. మరి ఈ టు స్పెషల్ ఈవెంట్స్ ని పురస్కరించుకుని ఒక సూపర్ ప్రోగ్రాంని జీ తెలుగు డిజైన్ చేసింది.

ఇందులో నటుడు గోపీచంద్, రాశిఖన్నా , సాయి పల్లవి, శుభలేఖ సుధాకర్, సురేష్, రాజీవ్ కనకాల, ప్రభాకర్, జబర్దస్త్ కమెడియన్స్ అంతా ఈ షోలో కనిపించి అలరించనున్నారు. "నాన్న హీరో మనకు నచ్చినప్పుడు, నాన్న జీరో మనకు నచ్చనప్పుడు" అని చెప్తూ స్టేజి మీద ఎమోషన్ అయ్యారు శుభలేఖ సుధాకర్. "థ్యాంక్యూ దిల్ సే " అనే ఈ షోకి సంబంధించిన ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో రిలీజ్ అయ్యింది. ఇక యాంకర్స్ గా వన్ అండ్ ఓన్లీ సుధీర్ , శ్రీముఖి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయనున్నారు. సుధీర్ కోసమే ఈ షో చూడాలి. సుధీర్ కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అంటూ సుధీర్ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.