English | Telugu

బిబి బజ్ లో శోభాశెట్టికి షాకిచ్చిన గీతు రాయల్!

బిగ్ బాస్ సీజన్-7 లో బాగా పాపులర్ అయిన పేరు శోభాశెట్టి. ఫౌల్ గేమ్ ఆడుతూ, ఎవరేం మాట్లాడిన వారి మీదకి నోరేసుకొని పడిపోతూ చీటికి మాటికి చిరాకు పడే ఏకైక కంటెస్టెంట్ శోభాశెట్టి. హౌస్ లో శోభాశెట్టి గొడవ పెట్టుకోని కంటెస్టెంట్ ఎవరైన ఉన్నారంటే చెప్పడం కష్టం. ఇక నిన్నటి ఎపిసోడ్‌లో శోభాశెట్టి ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత బిబి బజ్ ఇంటర్వూలో శోభా శెట్టిని గీతూ రాయల్ గట్టిగానే టార్గెట్ చేసింది. అయితే గీతు అడిగే ప్రశ్నలకి తనదైన స్టయిల్‌లో పొగరుగానే రిప్లయి ఇచ్చింది శోభాశెట్టి. అయితే అమర్‌దీప్.. శోభా గురించి అన్న ఒక వీడియోను చూపించగానే శోభాశెట్టి ముఖం మాడిపోయింది.

బేసిక్‌గా టాప్-10 టాస్కులో మీకు హౌస్‌మెట్స్ 7వ స్థానం ఇచ్చినప్పుడు మీరు ఒప్పుకోలేదు. ఇప్పుడు మీకు ఆడియన్స్ కూడా అదే పొజిషన్ ఇచ్చారు కదా అంటు అడుగగా.. దీనికి అలా మీరు అనుకుంటే నేనేం చేయలేనని శోభా అంది. తేజ మీరూ ట్రూ ఫ్రెండ్స్ అని చెప్పారు కదా.. మరి తను వెళ్లిపోయినప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా తేజ గురించి ఎందుకు మాట్లాడుకోలేదని అడుగగా.. నేను తేజ కోసం ఈ షోకి రాలేదంటూ సూటిగా చెప్పింది. " బడ్డీ టాస్కులో ప్రియాంక వల్లే మీరు ఓడిపోయారనే ఫీలింగ్ మీకు ఉంది కదా" అని అడుగగా.. మా మధ్య డిస్కషనే రాలేదని శోభా అంది. ప్రియాంక ఫీల్ అయిన వీడియో చూస్తారా అని గీతూ షాకిచ్చింది. దీంతో బిగ్‌బాస్ డేస్ నా లైఫ్‌లో అయిపోయాయని శోభా అనగా.. ఇంకా అయిపోలేదు, బిగ్‌బాస్ బజ్ కూడా అయితేనే అయినట్లంటు కౌంటర్ వేసింది గీతు. ఇక అమర్ విన్నర్ అవ్వాలని అనుకుంటున్నారు కదా మరి తను మీ గురించి ఏమన్నాడో చూడండి అంటూ ఓ వీడియో వేసింది చూపించింది. ఇందులో ప్రియాంకతో శోభా గురించి మాట్లాడుతూ "తను బ్యాక్ బిచ్చింగ్ (వెన్నుపోటు)" అని అమర్ అన్నాడు. ఈ వీడియో చూడగానే శోభా షాకైంది.

ఆ తర్వాత హౌస్‌మెట్స్ ఫొటోలు ఒక్కొక్కరివి చేత్తోనే ఇరగ్గొట్టేసి వారి గురించి చెప్పింది. శివాజీ ఫొటో పట్టుకొని "బిగ్‌బాస్ హౌస్‌లో నువ్వు నెగ్గుకు రావాలంటే శివాజీ సర్ ఆడుతున్న స్ట్రాటజీతో ఆడితే నువ్వు ఖచ్చితంగా విన్నర్ అవుతావ్" అంటూ శోభా చెప్పింది. మరి ఇది వెటకారంగా అందో లేక నిజంగానే చెప్పిందో ఇంటర్వ్యూలోనే తేలుతుంది. ఇక ఇది విని సేఫ్ శోభా అని చెప్పేసరికి.. శోభాకి కోపం వచ్చేసింది. ఒక కొశ్చన్‌కి ఆన్సర్ లేకపోతే సింపుల్‌గా తెలీదు, గుర్తులేదు, మర్చిపోయానని మీరు కవర్ చేసేస్తున్నారని అనగా.. ప్లీజ్ ఆపేస్తారా అని సైగ చేసింది శోభా. దాంతో ఈ ప్రోమో ఇప్పుడు వైరల్ గా మారింది. ఫుల్ ఎపిసోడ్ లో శోభాశెట్టి ఏం మాట్లాడిందోనని ఉత్కంఠ ఇప్పుడు అందరిలో‌ నెలకొంది.