English | Telugu

"నువ్విక్కడనుంచి వెళ్లకపోతే ముద్దిచ్చేస్తా " విక్రమాదిత్యకు శ్రీముఖి స్వీట్ వార్నింగ్

"ఆదివారం విత్ స్టార్ మా పరివారం" ఎపిసోడ్ ప్రోమో హాట్ హాట్ డైలాగ్స్ తో కట్ చేశారు. శ్రీముఖిని చూస్తేనే హాట్ గా ఉంటుంది ఇక అలాంటి యాంకర్ హాట్ డైలాగ్ చెప్తే ఇంకెంత హాట్ గా ఉంటుందో కదా. ఇక ఈ ఎపిసోడ్ కి ఈవారం "కలిసి ఉంటే కలదు సుఖం" సీరియల్ టీం, "నువ్వు నేను ప్రేమ" టీమ్స్ వచ్చాయి. ఇక ఎవరికి వాళ్ళు తమ తమ సీరియల్స్ మీద అద్దిరిపోయే స్లొగన్స్ ఇచ్చేసారు. " ఇక్కడ ఉంది కలిసి ఉంటే కలదు సుఖం టీం..మాతో పెట్టుకుంటే చూపిస్తా నరకం" అని సీరియల్ హీరో చరణ్ డైలాగ్ చెప్పేసరికి వెంటనే "ప్రేమకు అర్ధం కోనసీమ..పౌరుషానికి అర్ధం రాయలసీమ..గెలుపుకి అర్ధం నువ్వు నేను ప్రేమ" అని సీరియల్ హీరోయిన్ పద్దు అదిరిపోయే పంచ్ వేసేసింది.

ఇక "నువ్వు నేను ప్రేమ" సీరియల్ హీరో విక్రమాదిత్య స్టేజి మీదకు వచ్చేసరికి "టీవీలో చూసి ఏమో అనుకున్నా కానీ మంచి హైటే ఈ అబ్బాయి..కత్తి లాగున్నాడు" అని ఒక హాట్ కంప్లిమెంట్ ఇచ్చేసి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసింది. ఇక వెంటనే పుష్ప డైలాగ్ ని రీమిక్స్ చేసి చెప్పింది శ్రీముఖి "ఏంది స్వామి..నిన్ను చూడట్లేదని పులిపెక్కిపోతాండావంట...ఎక్కువ చేసావనుకో..ముద్దిచ్చేస్తా..అప్పుడు అదే ప్రోమోలో చూపిస్తారు..వెళ్ళిపో ఇక్కడనుంచి" అని విక్రమ్ ని ఒక రేంజ్ ఆడేసుకుంది..ఇక భావన "చంద్రముఖి"ని "బంగారం"ని రెండిటిని మిక్స్ చేసి వేసిన డాన్స్ నెక్స్ట్ లెవెల్...ఇక ఈ ఎపిసోడ్ రేపు అలరించబోతోంది.