English | Telugu

జబర్దస్త్ లోకి కొత్త బటర్ ఫ్లై!

జబర్దస్త్ ప్రతీ వారం ఆడియన్స్ కి ఏదో ఒక ట్విస్ట్ ఇస్తూనే అటెంషన్ మొత్తాన్ని తన వైపు తిప్పేసుకుంటోంది. పాత జడ్జెస్ వెళ్ళిపోయాక కొత్తవాళ్లను తెచ్చింది...కొత్తవాళ్ళలో కొందరు వెళ్ళిపోతే మళ్ళీ కొత్తవాళ్లను తెచ్చింది. ఒక యాంకర్ వెళ్ళిపోతే ఇంకో యాంకర్ వచ్చింది..ఇప్పుడా యాంకర్ వెళ్ళిపోయింది..మరో కొత్త యాంకర్ వచ్చింది. కంటెస్టెంట్స్ కూడా కొత్త వాళ్ళు వస్తున్నారు.

ఇలా ప్రతీ వారం ఫుల్ గా ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతూ వస్తోంది. ఇక త్వరలో సుడిగాలి సుధీర్ కూడా రాబోతున్నాడు. ఇక జబర్దస్త్ కి మళ్ళీ పూర్వ వైభవం వచ్చేలా కనిపిస్తోంది. అనసూయ వెళ్ళిపోయాక కొత్త యాంకర్ అంటూ పుకార్లు వచ్చినా కొత్త అమ్మాయిని తేకుండా రష్మినే తీసుకొచ్చారు. ఇక ఇప్పుడు రష్మీకి డేట్స్ కుదరకపోవడం కావొచ్చు, అలాగే మూవీ ప్రొమోషన్స్ తో బిజీ ఐపోయిన కారణంగా కావొచ్చు లేదంటే జబర్దస్త్ తో చేసుకున్న అగ్రిమెంట్ టైం ఐపోవడం కావొచ్చు కానీ నెక్స్ట్ ఎపిసోడ్ నుండి రష్మీ జబర్దస్త్ లో కనిపించదు. దానికి కారణం ఆమె ప్లేస్ లో కొత్త యాంకర్ వచ్చేసింది. లేటెస్ట్ జబర్దస్త్ ప్రోమో ద్వారా కొత్త యాంకర్ ని పరిచయం చేశారు.

జబర్దస్త్ కి కొత్తగా వచ్చిన ఆ యాంకర్ పేరు సౌమ్య రావు. సౌమ్య రావు గ్లామర్ ముందు రష్మీ, అనసూయ సరిపోరు అనిపిస్తుంది. ఫస్ట్ ఎపిసోడ్ లోనే తన స్టైల్ చూపించింది. కొత్త యాంకర్ ని జడ్జి ఇంద్రజ పరిచయం చేసింది. ఆల్రెడీ సౌమ్య గతంలో ఆదితో కలిసి ఒక స్కిట్ కూడా వేసింది. సౌమ్య కూడా రష్మీ లానే..తెలుగు మొత్తం తప్పుల తడకే..ఈమధ్య షోస్ లో తెలుగులో ఇంగ్లీష్ పదాల మోత విచ్చలవిడిగా కొనసాగుతోంది. తెలుగుని తింగరిగా మాట్లాడితేనే క్లిక్ అయ్యే అవకాశం ఎక్కువుందని భావిస్తున్నారో ఏమో అందరూ తెలుగును వెరైటీ మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు. మరి సౌమ్య రాబోయే రోజుల్లో ఎలా చేస్తుంది ఎలా మాట్లాడుతుంది, ఎలా ఎంటర్టైన్ చేస్తుందో చూడాలి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.