English | Telugu
సౌమ్యానా..సేమ్యానా..? కొత్త యాంకర్ ని టీజ్ చేసిన ఆది, రాంప్రసాద్!
Updated : Nov 5, 2022
బుల్లితెర మీద ప్రసారమయ్యే షోస్ లోకి ఎవరైనా కొత్త వాళ్ళు ఎంట్రీ ఇస్తే ఆల్రెడీ ఇక్కడ వున్న సీనియర్స్ ర్యాగింగ్ మాములుగా ఉండదు. ఇక ఇప్పుడు షోకి వచ్చిన కొత్త యాంకర్ సౌమ్య రావుకి జడ్జెస్, కమెడియన్స్ గ్రాండ్ వెల్కమ్ చెప్తూనే టీజ్ చేశారు ఆది, రాంప్రసాద్. మొదటి రోజు అని కూడా లేకుండా కొత్త యాంకర్ పై హైపర్ ఆది డబుల్ మీనింగ్ పంచులతో విరుచుకుపడ్డాడు.
సౌమ్య కూడా తగ్గేదెలా అన్నట్టుగానే ఉంది. "కొత్త అమ్మాయి రాగానే రాంప్రసాద్ వస్తాడని అనుకున్నా..అలాగే వచ్చాడు" అని ఇంద్రజ అనేసరికి " కొత్తది ఏమొస్తే వస్తారా మీరు" అంది కొత్త యాంకర్. ఆ కౌంటర్లు తో రాంప్రసాద్ సైలెంట్ ఐపోయాడు. వెంటనే ఆది "రష్మీ ఎలా చేస్తుందో నీ స్టయిల్లో చేసి చూపించు" అన్నాడు. అలాగే చేసి చూపించింది.. ఇంతలో రాఘవ వచ్చి " మీరు చాలా అందంగా ఉన్నారు" అనేసరికి "మీరు అందంగా ఉంటే పొగిడేదాన్ని" అని కౌంటర్ వేసింది కొత్త యాంకర్. "పర్లేదు నాలాగే అబద్దం చెప్పండి" అని రివర్స్ కౌంటర్ వేసాడు రాఘవ. ఇంతలో రాంప్రసాద్, ఆది వచ్చి "కొత్తగా వచ్చింది కదా..పేరేమిటో" అన్నాడు ఆది. "సౌమ్య" అని యాంకర్ పేరు చెప్పేసరికి " నువ్వెంత సౌమ్యమైనా మా కన్ను పడితే సేమ్యానే" అన్నాడు ఆది.
ఇలా సౌమ్య వాళ్ళతో ఢీ అంటే ఢీ అన్నట్టుగానే కౌంటర్లు వేసింది. ఐతే జబర్దస్త్ యాంకరింగ్ అనేది ఒక బిగ్ టాస్క్ అని చెప్పొచ్చు. ఆడియన్స్ ని మెప్పించి ఎక్కువ కాలం మనగలిగితే నిజంగా గొప్ప విషయమే. ఎందుకంటే రష్మీ, అనసూయ డేట్స్ కుదరని టైంలో టెంపరరీగా కొంతమంది యాంకర్స్ గా వ్యవహరించారు కానీ ఆడియెన్స్ ని మెప్పించలేకపోయారు. మరి ఇప్పుడు సౌమ్య రావుకి జబర్దస్త్ ఒక పెద్ద ఛాలెంజ్ అనే చెప్పాలి. చూడాలి..రాబోయే రోజుల్లో సౌమ్య రావు ఎంత మేరకు సక్సెస్ అవుతుందా అనేది...