English | Telugu
అది నైట్ తరువాతే అంటూ శ్రీముఖి రచ్చ
Updated : Nov 13, 2021
కోవిడ్ కారణంగా ఓటీటీలకు కొత్త ఊపొచ్చింది. దీంతో ఓటీటీ ప్లాట్ ఫామ్‌లు కుప్పులు తెప్పలుగా రియాలిటీ షోలతో పాటు కొత్త కొత్త సినిమాలకు శ్రీకారం చుడుతున్నారు. ఇదే క్రమంలో తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ `ఆహా` వరుసగా సరికొత్త టాక్ షోలతో రచ్చ చేయడం మొదలుపెట్టింది. ఇటివలే హీరో నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పర్యవేక్షణలో `అన్ స్టాపబుల్` ని ప్రారంభించి ఆహా అనిపించారు.
తాజాగా మరో షోకు తెరలేపారు. ఇప్పటికే జెమినీ టీవీలో అనసూయ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న `మాస్టర్ చెఫ్`కి ధీటుగా `ఆహా` ఓటీటీ కోసం `ఛెఫ్ మంత్ర` పేరుతో కొత్త షోకి శ్రీకారం చుడుతున్నారు. ఇదే ఓటీటీలో మంచు లక్ష్మి హోస్ట్‌గా `ఆహా భోజనంబు` పేరుతో ఓ షోని ఇప్పటికే ప్రసారం చేశారు. దానికి ఆశించిన స్థాయిలో ఆదరణ దక్కలేదు. దీంతో మరింత కొత్తగా `మాస్టర్ చెఫ్`కి ధీటుగా వుండాలని `ఛెఫ్ మంత్ర`ని మొదలుపెట్టారు.
సరికొత్తగా ప్రజెంట్ చేయబోతున్న ఈ షోకు హోస్ట్‌గా బుల్లితెర గ్లామర్ డాల్ శ్రీముఖి వ్యవహరిస్తోంది. జెమిని టీవీలో ప్రసారం అవుతున్న`మాస్టర్ చెఫ్`కి ఆహా `ఛెఫ్ మంత్ర`కున్న తేడా ఏంటంటే ఇందులో పలు రుచికరమైన వంటకాలని పరిచయం చేస్తూనే పలువురు సెలబ్రిటీలతో ఈ షోని మరింత కలర్ ఫుల్‌గా మలుస్తూ ప్రేక్షకులని ఎంటర్‌టైన్ చేయబోతున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోని ఆహా టీమ్ వదిలింది.
ఈ ప్రోమోలో శ్రీముఖి, సుహాస్, శ్రియా, రెజీనా సందడి చేస్తున్నారు. నాకు దోష కావాలి అని శ్రియ ముద్దు ముద్దుగా అడగడం.. డ్రింక్స్ వున్నాయా అని రెజీనా సందడి చేయడం.. అవన్నీ నైట్ తరువాతే అని శ్రీముఖి బదులివ్వడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. స్సై\సీ జాడీని తలపై పెట్టుకుని శ్రియ స్వాతిముత్యం డ్యమాన్స్ చేయడం.. అయ్యయ్యో తేలుతున్నారేంటీ?.. అంటూ శ్రీముఖి అంటున్న తీరు `ఛెఫ్ మంత్ర` షో పై ఆసక్తిని రేకెత్తిస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమో నెట్టింట సందడి చేస్తోంది.