English | Telugu

మ‌న‌కు తెలీని శ్రీ‌ముఖి మ‌రో కోణం.. ఫ్రెండ్‌షిప్ కోసం ఇంత చేసిందా!

‘నేను అప్పట్లో శ్రీముఖిని చూసి బాగా పొగరు అనుకున్నాను. కానీ, ఇప్పుడు శ్రీముఖిగారికి పెద్ద ఫ్యాన్‌ అయ్యా. సూపర్‌ శ్రీముఖిగారు. మీ మీద రెస్పెక్ట్‌ పెరిగింది’ అని యూట్యూబ్‌లో ‘కామెడీ స్టార్స్‌’ ప్రోమో కింద మహేష్‌ అనే నెటిజన్‌ చేసిన కామెంట్‌. దానికి దగ్గర దగ్గర వెయ్యి లైకులు. అతనొక్కడే కాదు, చాలామంది ‘శ్రీముఖి మనసు బంగారం’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. బుల్లితెర రాములమ్మగా పేరు తెచ్చుకున్న యాంకర్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. శ్రీముఖి మీద గౌరవం పెరిగిందని చెబుతున్నారు. ఇంతకీ, శ్రీముఖి ఏం చేసింది? అంటే...

‘జబర్దస్త్‌’ షోతో అవినాష్‌కు గుర్తింపు దక్కింది. దాంతో అతడికి ‘బిగ్‌ బాస్‌’ రియాలిటీ షోలో పాల్గొనే అవకాశం దక్కింది. అయితే, ‘బిగ్‌ బాస్‌’ హౌస్‌కు వెళ్లడానికి ‘జబర్దస్త్‌’ షో ప్రొడ్యూస్‌ చేస్తున్న మల్లెమాలతో ఉన్న అగ్రిమెంట్‌ అడ్డం వచ్చింది. పది లక్షలు కడితేనే తప్ప ‘జబర్దస్త్‌’ను వీడి ‘బిగ్‌ బాస్‌’కు వెళ్లలేని పరిస్థితి. అవినాష్‌ దగ్గర అంత డబ్బు లేదు. అప్పుడు అతడి కష్టం తెలుసుకుని శ్రీముఖి డబ్బులు ఇచ్చింది. ఫ్రెండ్షిప్‌ డే స్సెషల్‌గా చేసిన కామెడీ స్టార్స్‌ ఎపిసోడ్‌లో అవినాష్‌ ఈ విషయం చెప్పాడు.

‘‘యాక్చువల్లీ... నాకు ఎవర్నీ డబ్బులు అడగటం ఇష్టం ఉండదు. షూటింగ్స్‌ లేక, అమ్మానాన్నలకు ఆపరేషన్స్‌ చేయించి... అప్పుడు నాకు సూసైడ్‌ థాట్స్‌ వచ్చాయి. ఆ టైమ్‌లో నాకు బిగ్‌ బాస్‌ ఆఫర్‌ రావడం, పది లక్షలు కడితేనే వెళ్లాలంటే... అప్పుడు డబ్బులు లేక ఎవర్ని అడగాలో తెలియలేదు. ఎవరి అడిగితే ఏం అనుకుంటారో అనే భయం. శ్రీముఖినీ అడగలేదు. తను తెలుసుకుంది. ‘డబ్బులివ్వాలి అమ్మా’ అంటే... వెంటనే ఇంట్లోంచి క్యాష్‌ తీసుకుని వచ్చి ఇచ్చింది. ఎటువంటి ప్రూఫ్స్‌ లేకుండా ఇచ్చింది. కేవలం నమ్మకంతో’’ అని అవినాష్‌ కన్నీళ్లు పెట్టుకున్నాడు. చాలా ఎమోషన్‌ అయ్యాడు. అతడిని శ్రీముఖి ఆత్మీయంగా దగ్గరకు తీసుకుంది.

‘కామెడీ స్టార్స్‌’ ఫ్రెండ్షిప్‌డే ఎపిసోడ్‌లో అవినాష్‌ ఓ స్కిట్‌ చేశాడు. శ్రీముఖి ఇంట్లో ఎలా ఉంటుంది? ఆమె బర్త్‌డే పార్టీ జరిగినప్పుడు ఏం జరిగింది అనేది ఫన్నీగా చూపించాడు. శ్రీముఖి గెటప్‌ వేశాడు.

‘నా పేరు శ్రీముఖి...
నేను ఎవరితోనైనా ధైర్యంగా మాట్లాడతాను ముఖాముఖి...
నాకు కోపం వస్తే అవుతాను చంద్రముఖి’ అని అవినాశ్‌ కవిత కూడా చెప్పాడు.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.