English | Telugu

‘బిగ్‌బాస్‌3’... ఇన్‌స్టాలో ఎవరి ఫాలోయింగ్‌ ఎంత?

‘బిగ్‌బాస్‌ 3’తో టీవీ ఆడియన్స్‌లో పాపులర్‌ అయిన గ్లామర్‌ డాల్‌ అషురెడ్డి ఖాతాలో ఓ రికార్డ్‌ చేరింది. ఇన్‌స్టాలో ఆమెను ఫాలో అవుతున్న జనాల సంఖ్య వన్‌ మిలియన్‌కు చేరింది. ‘బిగ్‌ బాస్‌’కు వెళ్లకముందు నుండి సోషల్‌ మీడియాలో ఆమె యాక్టివే. రియాలిటీ షోలో ఛాన్స్‌ రావడం వెనుక సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ పనికొచ్చింది. బిగ్‌బాస్‌ హౌస్‌ నుండి తిరిగొచ్చిన తర్వాత టీవీ షోల్లో పార్టిసిపేట్‌ చెయ్యడం, కొన్నిటికి యాంకరింగ్‌ చెయ్యడంతో ఆమె ఫాలోయింగ్‌ పెరుగుతోంది. ఇప్పుడు ఇన్‌స్టాలో ఆమె వెనుక పదిలక్షల మంది ఉన్నారు.

సెప్టెంబర్‌ సెకండ్‌ వీక్‌ నుండి తెలుగులో ‘బిగ్‌ బాస్‌ 5’ రియాలిటీ షో స్టార్ట్‌ కానుందని వార్తలు వినిపిస్తున్నాయి. షోకు వెళితే ఫాలోయింగ్‌ పెరుగుతుందని చాలామంది ట్రయల్స్‌ స్టార్ట్‌ చేశారు. ఈ నేపథ్యంలో ‘బిగ్‌ బాస్‌ 3’కి వెళ్లొచ్చిన సెలబ్రిటీలకు ఇన్‌స్టాలో ఎంత ఫాలోయింగ్‌ ఉందో చూడండి.

అషురెడ్డి కంటే ముందు స్టార్‌ యాంకర్‌ శ్రీముఖి, సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌ ఉన్నారంతే. శ్రీముఖికి 3.7 మిలియన్స్‌ (37 లక్షలమంది) ఫాలోయర్లు ఉన్నారు. రాహుల్‌ సిప్లిగంజ్‌ను ఫాలో అవుతున్న వాళ్ల సంఖ్య 1.3 మిలియన్‌ మాత్రమే. పదమూడు లక్షలు అన్నమాట. అషురెడ్డితో పాటు హిమజకు పదిలక్షల (వన్‌ మిలియన్‌) మంది ఫాలోయర్లు ఉన్నారు.

కంటెస్టెంట్‌ పేరు: ఫాలోయర్ల సంఖ్య
శ్రీ‌ముఖి : 37,00,000
రాహుల్ సిప్లిగంజ్ : 13,00,000
అషురెడ్డి: 10,00,000
వరుణ్‌ సందేశ్‌ : 3,37,000
అలీ రేజా : 5,87,000
శివజ్యోతి/సావిత్రి : 7,92,000
వితికా శేరు : 8,34,000
మహేశ్‌ విట్టా : 68,000
పునర్నవి భూపాలం : 5,37,000
రవికృష్ణ : 2,86,000
హిమజ : 10,00,000
శిల్పా చక్రవర్తి : 54,000
రోహిణి : 4,64,000
తమన్నా సింహాద్రి : 19,000
హేమ : 29,000

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.