English | Telugu

ఢీలో ఇక కనిపించకపోవచ్చు...శ్రీప్రియ ఆవేదన!

ఢీలో ఇక కనిపించకపోవచ్చు...శ్రీప్రియ ఆవేదనఢీ షోలో కంటెస్టెంట్ శ్రీప్రియ గురించి పెద్దగా చెప్పక్కర్లేదు. మంచి డాన్సర్ గా పేరు తెచ్చుకుంది. అలాంటి శ్రీప్రియను డాక్టర్స్ ఇక డాన్స్ చేయకుండా రెస్ట్ తీసుకోమని చెప్పారట. ఇంతకు ఏమయ్యిందో చూద్దాం. శ్రీప్రియ ఈ మధ్య ప్రాక్టీస్ చేస్తుంటే మోకాలి దగ్గర స్వెల్లింగ్ వచ్చేస్తోంది అని ఆ నొప్పి భరించలేకపోతున్నానని చెప్పింది. ఇక డాక్టర్ ని కన్సల్ట్ అయ్యేసరికి రెస్ట్ తీసుకోమని చెప్పారట.

ఐతే ఇప్పుడున్న షెడ్యూల్ ప్రకారం అసలు రెస్ట్ తీసుకునే పొజిషన్ లేదు కాబట్టి వెంటనే ఎంఆర్ఐ చేయించామన్నారని చెప్పారట. ఐతే ఆ స్కాన్ లో ఎముకకు కొంచెం ఫ్రాక్చర్ అయ్యిందని దాంతోనే స్వెల్లింగ్ వస్తోంది అని చెప్పారట. ఐతే డాక్టర్ మాత్రం కంప్లీట్ గా రెస్ట్ తీసుకోమని సజెస్ట్ చేశారని చెప్పింది. ఒకవేళ డాన్స్ చేసేటప్పుడు పెయిన్ లేకపోతే గనక చేయమన్నారని లేదంటే మాత్రం రెస్ట్ తప్పనిసరి అని చెప్పారని చెప్పింది శ్రీప్రియా. ఈ పదేళ్లలో ఎన్నో సీరియల్స్ లో చేసినా కానీ ఢీ షోతోనే తనకు ఎంతో పేరొచ్చింది. కానీ ఇప్పుడు ఎం చేయాలో అర్ధం కావడం లేదు అని చెప్పింది. మాష్టర్ కి మానేజ్మెంట్ ఎలా చెప్పాలో అని బాధపడింది. ఇలా తనకు ఒక మంచి పేరు వచ్చే టైంలో సడెన్ ఇలా జరగడం చాల బాధగా అనిపిస్తుంది అంటూ ఫీలయ్యింది శ్రీప్రియ. ఇక మేనేజ్మెంట్ వాళ్ళు కూడా ఇది మీ లైఫ్ కాబట్టి మీరే ఆలోచించుకోండి ఢీ అనేది ఒక షో మాత్రమే అని చెప్పారట. ఏది జరిగినా మన మంచికే కాబట్టి ఇంతవరకు ఢీ షోలో సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు అని చెప్పింది శ్రీప్రియ.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.