Read more!

English | Telugu

అవినాష్,అనిల్, శ్రీకర్ అమ్మాయిల్లా ఎలా ఉంటారో తెలుసా!


ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో ఈవారం ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో ఈ వారం కాన్సెప్ట్ ఏంటి అంటే ఇండస్ట్రీ సీనియర్స్ వెర్సెస్ బ్లాక్ బస్టర్ జూనియర్స్ థీమ్ నడిచింది. ఈ షోలో శ్రీముఖి ఒక ఇంటరెస్టింగ్ కాన్సెప్ట్ ని చూపించింది. యాక్టర్స్ గనక అమ్మాయిల్లా పుడితే ఎలా ఉంటారో చూపించింది. అవినాష్ అమ్మాయిలా పుడితే ఎలా ఉంటాడో ఒక పిక్ ని ప్లే చేయించింది. అవినాష్ అమ్మాయి పిక్ ని హాఫ్ మాత్రమే చూపించేసరికి సీనియర్ నటుడు అనిల్ వెంటనే ఫుల్ పిక్చర్ లేదా అని అడిగాడు. ఆయన మనసులో అంతరార్ధం గ్రహించినట్టుగా శ్రీకర్ వెంటనే ఎం చూద్దామని అండి అని కౌంటర్ వేసాడు.

తర్వాత అనిల్ అమ్మాయిలా పుడితే గడ్డాలు మీసాల్లేకుండా ఎలా ఉంటారో చూపించింది. బ్రహ్మముడి శ్రీకర్ గనక అమ్మాయి శ్రీకరిణిలా పుడితే ఎలా ఉంటుందో ఒక పిక్ లో చూపించింది. ఇక సీనియర్ నటుడు అనిల్ ని ఆటపట్టించింది శ్రీముఖి. "అనిల్ గారు మీరు ఇండస్ట్రీకి ఎప్పుడు వచ్చారు" అని అడిగేసరికి 2001 లో వచ్చానని చెప్పాడు. "ప్రేరణా ఆ టైంలో నువ్వు ఎం చేస్తున్నావ్" అని అడిగేసరికి "ఫస్ట్ క్లాస్ చదువుతున్నా" అని చెప్పింది. "2001 లో హమీదా నువ్వు ఎం చేస్తున్నావ్" అని మళ్ళీ అడిగింది శ్రీముఖి. "అప్పుడు ఆయన టీవిలో వచ్చేవారు.

ఆయన్ని చూపించి బూచోడు వచ్చాడు అని చెప్పి నానమ్మ నాకు భోజనం పెట్టేది" అని చెప్పేసరికి అనిల్ ఎక్స్ప్రెషన్ మాములుగా లేదు. తర్వాత అవినాష్ మీరెప్పుడు వచ్చారు ఇండస్ట్రీకి అని శ్రీముఖిని అడిగేసరికి 2008 లో వచ్చానని చెప్పింది. దాంతో హరి తాను అప్పుడు ఏడవ తరగతి చదువుతున్నాను అని చెప్పాడు.  ఇలా ఈ వారం ఈ షో ఎంటర్టైన్ చేయబోతోంది.