English | Telugu
శోభాశెట్టి ఎలిమినేషన్ ఫిక్స్.. పాటబిడ్డ భోలే అరుదైన రికార్డు!
Updated : Nov 2, 2023
బిగ్ బాస్ సీజన్-7 రోజు రోజుకి కొత్తగా మారుతుంది. నిన్నంతా నామినేషన్ లో ఉన్నవారికి జరిగిన ఓటింగ్ పోల్స్ లో యావర్ మొదటి స్థానం, రెండవ స్థానంలో భోలే షావలి.. చివరి మూడు స్థానాలలో అశ్వినిశ్రీ, టేస్టీ తేజ, శోభాశెట్టి ఉండగా.. నేటి అనఫీషియల్ ఓటింగ్ పోల్ లో పాటబిడ్డ భోలే అత్యధిక ఓటింగ్ తో మొదటి స్థానంలోకి చేరుకున్నాడు.
ఇక గతవారం ఎలిమినేషన్ లో లీస్ట్ లో ఉన్న శోభాశెట్టి ఈవారం కూడా ఉంది. టేస్టీ తేజ, శోభాశెట్టిల మధ్య తక్కువ ఓట్ల తేడాతో ఇద్దరు లీస్ట్ లో ఉన్నారు. అయితే నిన్న నమోదైన అనఫీషియల్ ఓటింగ్ పోల్స్ లో అశ్వినిశ్రీకి లీస్ట్ లో ఉండగా.. నేడు అత్యధిక ఓటింగ్ తో ప్రియాంక కంటే ఒక స్థానం పైకి వచ్చి, తన గ్రాఫ్ ని పెంచుకుంటుంది. ఇక హౌస్ లో ఎవరేం మాట్లాడినా వారి మీదకి నోరేసుకొని పడిపోయే శోభాశెట్టి కన్నింగ్ స్ట్రాటజీ, ఫౌల్ గేమ్ తో ప్రేక్షకులు విసుగుచెందినట్టుగా స్పష్టమవుతుంది. టేస్టీ తేజ, శోభా శెట్టి చేస్తున్న ఫేక్ లవ్ డ్రామా అట్టర్ ఫ్లాప్ అయిందని ప్రేక్షకుల ఓటింగ్ ని బట్టి తెలుస్తుంది.
హౌస్ లో భోలే ఎక్కడున్న పాటలు పాడుతూ, ఫెయిర్ గేమ్ ఆడుతూ అదరగొడుతున్నాడు. మొన్న పాడిన అమ్మ పాట ఇంకా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. పాటబిడ్డ సీరియల్ బ్యాచ్ కి 'సరైనోడు' అంటూ ట్రోల్స్ ఊపందుకున్నాయి. అయితే మొదటివారం పెద్దగా ఆడకుండా, ఏదో ఏదో మాట్లాడుతున్నాడని రెండోవారమే ఎలిమినేట్ అయిపోతాడని అనుకున్నారంతా కానీ ఓటింగ్ లో మొదటి స్థానంలో ఉండి అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. మరి ఈ వారం శోభాశెట్టి, టేస్టీ తేజలలో ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి మరి.