English | Telugu
పల్లవి ప్రశాంత్ అంటే అంత భయమా!
Updated : Nov 2, 2023
బిగ్ బాస్ హౌస్ లో గతవారం ఎలిమినేషన్ అయి బయటకొచ్చిన ఆట సందీప్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. గత నాలుగు రోజుల నుండి సోషల్ మీడియాలో ఆట సందీప్ పోస్ట్ లతో ట్రెండింగ్ లో ఉన్నాడు.
హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ తో గేమ్ ఆడలేక వాళ్ళని పక్కన పెడుతున్నారని, అలా ఆడితే కిక్కేముంటుందని, నన్ను కూడా అలానే తప్పించారని మరొక పోస్ట్ ని పెట్టాడు. హౌస్ లో ఉన్నన్ని రోజులు పల్లవి ప్రశాంత్ గేమ్ ని అర్థం చేసుకోకుండా సీరియల్ బ్యాచ్ తో కలిసి ఆడిన ఆట సందీప్.. ఇప్పుడు అతను గేమ్ బాగా ఆడతాడని, అతనికి అపోజిట్ గా ఉన్నవాళ్ళంతా తనని చూసి బయపడుతున్నారంటూ సపోర్ట్ చేస్తున్నాడు. టేస్టీ తేజ సిల్లీ నామినేషన్ లో బలైన ఆట సందీప్.. అతను ఒక ఫేక్ కంటెస్టెంట్ అంటు బహిరంగ మాట్లాడాడు. బిగ్ బాస్ సీజన్-7 లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కంటెస్టెంట్ ఆట సందీప్. బిగ్ బాస్ సీజన్-7 లో మొట్టమొదటి హౌస్ మేట్ గా నిలిచిన ఆట సందీప్ ఎనిమిదవ వారం ఎలిమినేట్ అయ్యాడు. ఇప్పుడు ఈ ఎలిమినేషన్ పై ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
గతవారం జరిగిన నామినేషన్‌లో యావర్ , టేస్టీ తేజ కలిసి ఆట సందీప్ ని నామినేట్ చేసిన విషయం తెలిసిందే. ఇక నామినేషన్‌లో ఉన్న ఆట సందీప్.. ఓటింగ్ విషయంలో లీస్ట్ లో ఉండటంతో బిగ్ బాస్ ఎలిమినేట్ చేసేశాడు. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. అసలు ఓటింగ్ లో లీస్ట్ లో ఉంది శోభాశెట్టి. కానీ బిగ్ బాస్ ఆడిన ఆటలో ఆట సందీప్ ఎలిమినేట్ అయ్యాడని నెటిజన్లు భావిస్తున్నారు.
దీనికి కారణం ఏంటంటే.. గత ఏడు వారాల నుండి హౌస్ నుండి ఫీమేల్ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవుతున్నారు. కాగా ఈ వారం కుడా శోభాశెట్టి ఎలిమినేషన్ అయితే హౌస్ లో కలరింగ్ తగ్గుతుందని భావించిన బిగ్ బాస్.. ఈ ట్విస్ట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే హౌస్ లో ఆట సందీప్ చాలాసార్లు సంచాలకుడిగా చేశాడు. కానీ అన్నిసార్లు సీరియల్ బ్యాచ్ ని గెలిపించడానికి ఫౌల్స్ చేశాడని ప్రేక్షకులకి తెలిసిందే. అయితే ఇప్పుడు పల్లవి ప్రశాంత్ కి ఆట సందీప్ చేయడంతో అతడి అభిమానులు సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు.