English | Telugu
ఫేమస్ కమెడియన్ అనుమానాస్పద మృతి... అనిత చౌదరి ఇంటరెస్టింగ్ పోస్ట్
Updated : Nov 2, 2023
తెలుగులో ఒకప్పుడు టాప్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న అనితా చౌదరి గురించి అందరికీ తెలుసు. పలు షోల ద్వారా మంచి పాపులారిటీ సంపాదించాక ఈ ఫీల్డ్ కి దూరమయ్యింది. చాలా కాలం తర్వాత ఉయ్యాల జంపాల, ఛత్రపతి మూవీస్ తో సినిమాతో మళ్లీ సిల్వర్ స్క్రీన్ మీద మెరిసింది అనితా చౌదరి. అలాంటి అనిత జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచుకుంటోంది. అలాంటామె రీసెంట్ గా ఒక పోస్ట్ పెట్టింది. " ఒంటరితనంతో, డిప్రెషన్ తో బాధపడుతున్న కూడా ఈ టెలివిజన్ ప్రపంచాన్ని ఎప్పుడూ మీ నవ్వుతో , ఉత్సాహంతో, ఆనందంతో అలరిస్తూనే ఉన్నారు..
అలాంటి వ్యక్తికి మరణం లేదనేది నా అభిప్రాయం.. మాథ్యూ పెర్రీ మీరు ఒక లెజెండ్, మీరు ఈ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లో ఎంతో ప్రభావాన్ని చూపించారు. ఎంతో మందికి ఆనందం పంచారు..అలాంటి మీరు మీకు నచ్చిన చోటికి అదే ఆనందాన్ని వెతుక్కుంటూ వెళ్లిపోయారంటూ" అనిత చౌదరి పెట్టిన ఒక ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకు విషయానికి వస్తే అమెరికాకు చెందిన ఫేమస్ యాక్టర్, కమెడియన్ మాథ్యూ పెర్రీ రీసెంట్ గా అనుమానాస్పద రీతిలో తన ఇంట్లోని హాట్ టబ్‌లో అసప్మారక స్థితిలో మరణించి కనిపించారు. 1994 నుంచి 2004 వరకు వరుసగా 10 సీజన్లు "ఫ్రెండ్స్" అనే పేరుతో రూపొందించిన ఈ సిరీస్ లో చాండ్లర్ బింగ్ పాత్రలో నటించిన ఫెర్రీకి మంచి గుర్తింపు వచ్చింది. న్యూయార్క్‌లోని ఆరుగురు ప్రముఖుల జీవితాలు వాళ్ళ డేటింగ్ వాళ్ళ కెరీర్ మెయిన్ థీమ్ గా వచ్చింది ఈ ‘ఫ్రెండ్స్’ సిరీస్ . ఈ సిరిసీ ప్రపంచ వ్యాప్తంగా బాగా పాపులారిటీ దక్కించుకుంది.