English | Telugu
Actor Sivaji : ఉప్మా ఛాలెంజ్ విసిరిన శివాజీ!
Updated : Jan 27, 2024
సెలెబ్రిటీలు స్టార్ట్ చేసిన ఛాలెంజ్ ని ఫ్యాన్స్ చేస్తుంటారు. బిగ్ బాస్ సీజన్ సెవెన్ తో ఎంతోమందికి దగ్గరైన శివాజీ తన ఇన్ స్ట్రాగ్రామ్ లో అభిమానులకి సరికొత్త ఛాలెంజ్ విసిరాడు. 90's వెబ్ సిరీస్ లో వాళ్ళ అమ్మ రెగ్యులర్ గా ఉప్మా చేస్తుంటే పిల్లల ఎవరూ తినకుండా స్కూల్ కి వెళ్తారు. అది ఓ ఎమోషన్ అంటూ శివాజీ ఆ పిల్లలకి చెప్పడంతో అందరు ఉప్మాకి కనెక్ట్ అవుతారు.
బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో శివాజీ ఈజ్ నెంబర్ వన్ అని మొదటి నుండి ఎన్నో వార్తలు, మరెన్నో పేజ్ లలో చెప్పుకున్నారు. ఎందుకంటే శివాజీ ఫెయర్ ప్లే, తప్పు చేయకూడదని అందరిని గైడ్ చేసే విధానం, అమాయకుడైన యావర్, రైతుబిడ్డ ప్రశాంత్ పక్షాన నిల్చొని గ్రూప్ గా ఆడుతున్న స్పా బ్యాచ్ కి ఎదురునిలిచాడు. అందుకే శివాజీకి ఫ్యాన్ బేస్ మాములుగా లేదు. బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో టాప్-3 గా శివాజీ నిలిచాడు. ప్రస్తుతం శివాజీ తన ఇంట్లో ఉండి కొత్తరకం వంటలతో నెటిజన్లకి సవాళ్ళు విసిరుతున్నాడు. ఆ వెబ్ సిరీస్ లో ఉప్మా అనేది మిడిల్ క్లాస్ వాళ్ళ ఎమోషన్ అంటు చెప్పగా అది ఇప్పుడు చేస్తున్నానని చూపించాడు శివాజీ. ఉప్మా చేయడం తేలికే కానీ దాన్ని రెగ్యులర్ గా తినాలంటేనే కాస్త ఇబ్బంది అని అందరు అనుకుంటారు. అలాంటివాళ్ళకి శివాజీ రుచికరమైన ఉప్మాని నేను చేస్తున్నాను.. మీరు చేసి నాకు ట్యాగ్ చేయండి అని శివాజీ ఆ వీడియోలో చెప్పుకొచ్చాడు.
అరేయ్ టేస్టీ తేజ నీకే చెప్తున్నా.. ఉప్మా చేసి చూపించు. నయని పావని నువ్వు కూడ చేయు అమ్మ, పల్లవి ప్రశాంత్ నువ్వు చేసి పంపించు.. అలాగే బిగ్ బాస్ హౌస్ మేట్స్ కాకుండా రెండు తెలుగు రాష్ట్రాలలోని అక్కలు, చెల్లెళ్ళు, అమ్మలు, బావలు, బామ్మర్దులు, అందరికి చెప్తున్నాను. మీరు ఉప్మా చేసి ఓ రెండు నిమిషాల్లో వీడియోగా చేసి నాకు ట్యాగ్ చేయండి అలాగే ఈటీవి విన్ కి ట్యాగ్ చేసి ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయండి అని శివాజీ చెప్పాడు. ఈ వీడియోకి తేజ కామెంట్ చేశాడు. నేను టేస్టీ తేజ అన్న.. చేయడం రాదు టేస్ట్ చేయడమే వచ్చు అని టేస్టీ తేజ కామెంట్ చేశాడు. నేను చేస్తాను కానీ నువ్వు టేస్ట్ చేయాలి అన్న అని నయని పావని కామెంట్ చేసింది. యావర్ కూడా స్పందించాడు. వీళ్ళే కాకుండా బిగ్ బాస్ అభిమానులు శివాజీ ఫాలోవర్స్ అందరు తెగ కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఈ వీడియో ఫుల్ వైరల్ గా మారింది.