English | Telugu
ఆది..ఆది..నీదేది ? శ్రీప్రియ ఇన్ స్కందా ?
Updated : Jan 27, 2024
ఢీ సెలబ్రిటీ స్పెషల్ నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో రెట్రో థీమ్ ఇచ్చారు జడ్జెస్. సాత్విక్ చిరంజీవి ఎవర్ గ్రీన్ సాంగ్ "పట్టుకో పట్టుకో పగ్గమేసి పట్టుకో" అనే సాంగ్ కి మంచి స్వాగ్ తో స్టైలిష్ గా డాన్స్ చేసాడు. ఈ డాన్స్ కి శేఖర్ మాష్టర్ ఫిదా ఇపోయారు. చిరంజీవి చేసిన డాన్స్ గుర్తొచ్చింది అంటూ కాంప్లిమెంట్ ఇచ్చారు. ఇక ఆది ఎప్పటిలా తన స్కిట్ తో రెడీ ఐపోయాడు. ప్రతీ వారం ఏదో ఒక కాన్సెప్ట్ తో ఎంట్రీ ఇస్తూ ఆటపట్టిస్తూ ఉంటాడు.
ఈ రాబోయే వారంలో బ్లాక్ అండ్ వైట్ మూవీస్ లో కనిపించే దొంగ గెటప్ లో వచ్చాడు. ఇక నందు ఆదిని చూసి ఏంటీ గెటప్ అనేసరికి "దొంగ" అని ఆది ఆన్సర్ ఇచ్చేసరికి ఏం అడగాలో అర్ధం కాక "ఎవరినీ" అంటూ సంబంధం లేని డైలాగ్ వేసాడు. దానికి ఆది నోరెళ్లబెట్టాడు. "స్టేజి మీద ఉన్న అందరి ఫోన్ లు కొట్టేసాను. ఫస్ట్ ఫోన్ ఎవరిదో తెలుసా శేఖర్ మాష్టర్ ది. ఇక అందులో నందిత, ప్రియమణి, పూర్ణ, ప్రణీత అని పేర్లు చెప్పేసరికి ప్రణీత ఈవిడ కాదు డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్రణీత..అయ్యా అయ్యా వద్దయ్యా చిన్న పిల్లయ్యా వదిలేయండయ్యా" అంటూ శేఖర్ మాష్టర్ ఆమెను ఏదో చేసేస్తున్నట్టు ఆది బతిమిలాడి వదిలేయమన్నట్టు ఫీల్ తెప్పించే డైలాగ్ వేసేసరికి శేఖర్ మాష్టర్ పగలబడి నవ్వాడు. తర్వాత వర్షిణి వచ్చి శ్రీదేవి హిట్ సాంగ్ "అందాలలో నవోనవోదయం" కి డాన్స్ చేసింది. ఆమె ఈ గెటప్ లో ఏంజెల్ లా ఉందంటూ శేఖర్ మాష్టర్ కాంప్లిమెంట్ ఇచ్చారు.
ఇక కార్తీక దీపం చిన్నారి సహృద "ప్రియరాగాలే" సాంగ్ కి డాన్స్ చేసింది. "నువ్వు చేసే ప్రతీ మూమెంట్ లో ఒక ప్రొఫెషనలిజం ఉంటుంది" అంటూ కితాబిచ్చారు శేఖర్ మాష్టర్. తర్వాత ఆది కొట్టేసిన సెల్స్ లోంచి శ్రీప్రియ సెల్ తీసి గూగుల్ లో ఏం సెర్చ్ చేసిందో చూడు అంటూ నందూకి చూపించాడు. "శ్రీప్రియ ఇన్ స్కందా అనగానే కింద చూడు ఎక్కడుంది నీ బొంద" అని వచ్చిందన్నారు. తర్వాత ఆది మీద కవిత చెప్పమంటూ నందు శ్వేతా నాయుడుని పిలిచాడు "ఆది ఆది" అని చెప్పేంతలో "ఆది ఆది నీదేది" అంటూ శేఖర్ మాష్టర్ కౌంటర్ కవిత చెప్పేసాడు. ఆ బూతుకు ఆది ఫేస్ ఎక్స్ప్రెషన్ మాములుగా లేదు. ఫైనల్ గా జెస్సి వచ్చి "కన్నుకొట్టరో" సాంగ్ కి డాన్స్ చేసేసరికి డాన్సర్స్ లో ఒకామె "చాలా క్యూట్ గా ఉంటారు కదా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించింది" అని కామెంట్ చేయడంతో అందరూ నవ్వేశారు. "జెస్సి డాన్స్ ఎక్స్ప్రెషన్స్ చూసేటప్పుడు నాకు ఒకటి అడగాలని అనిపిస్తుంది ..నీ మూతి మీద ఎవడు ? "అంటూ ఒక బూతు డైలాగ్ వేసాడు ఆది.