English | Telugu

భూమి తల్లి శపిస్తోంది...ఇకనైనా మన ఆరోగ్యం కాపాడుకుందాం

ఒకప్పుడు మనమంతా పల్లెటూళ్ళల్లో ఉండేవాళ్ళం...పంటలు పండించుకుని ఎలాంటి పురుగుమందులు వాడకుండా ఆర్గానిక్ ఫుడ్ ని తినేవాళ్ళం..అందుకే మన తాతలు, బామ్మలు 90 ఏళ్ళు వచ్చినా కూడా నడుములు ఒంగకుండా, కళ్ళజోడులు పెట్టుకోకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఒక్క మందుబిళ్ల కూడా వేసుకోకుండా ఏళ్లకేళ్లు బతికారు. కానీ తర్వాత తరం మారింది. గడిచిన ఈ ఇరవై ఇళ్లల్లో పంటలు, పొలాలు, రైతులు, ప్రజలు, తిండి, తిప్పలు, విధానాలు, రోగాలు ఇలా అన్నిట్లో భయంకరమైన మార్పులు వచ్చాయి.. ఆర్గానిక్ ఫుడ్ కాస్తా పోయి విషం తినాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే పుట్టిన వాళ్లకు చూపు లేకుండా, క్యాన్సర్స్ తో, రకరకాల స్కిన్ ఇన్ఫెక్షన్స్ తో బతుకుతున్నారు చాలా మంది. ఇలాగే ఇంకొన్నేళ్లు ఉంటే మనుషుల మీద కొత్త కొత్త రోగాలు దాడి చేసి మరణాల రేట్ పెరిగిపోయే అవకాశం చాలా కనిపిస్తోంది.

అలాంటి ఎంతోమందికి ఆర్గానిక్ ఫుడ్ గురించి అవగాహన కల్పించేందుకు చాలామంది ఈ మధ్యకాలంలో ముందుకొస్తున్నారు. ఇప్పుడు యాంకర్ ఉదయభాను కూడా తన పొలంలో ఆర్గానిక్ ఫుడ్ తయారు చేసుకుంటూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది. అలాగే పంటలకు పెస్టిసైడ్స్ కాకుండా గో-ఆధారిత జీవామృతాన్ని ఎలా తయారు చేసుకోవాలో కూడా తన యూట్యూబ్ వీడియోస్ లో చూపిస్తోంది. జీవామృతంలో ఆర్గానిక్ బెల్లం మాత్రమే వేయాలని ఒకవేళ అది దొరకని పక్షంలో మాగిపోయిన పళ్ళను ఐనా ఉపయోగించవచ్చని చెప్పింది. అలా జీవామృతాన్ని తయారు చేసి చూపించింది. ఇక ఈ ఇన్స్పిరేషనల్ వీడియో చూసి నెటిజన్స్ కూడా పాజిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు. "హాయ్ భానుగారు నేను కూడా రైతు బిడ్డనే కానీ పొలం పనులు ఎప్పుడు చేయాలేదు మీ వీడియో చూసాక నేను ఏం తప్పు చేశానో తెలిసింది..జనాల్లో అవేర్నెస్ క్రియేట్ చేస్తోంది..." అంటున్నారు. ఇదే కదా మనందరి ఆరోగ్యం, భావితరాల భవిష్యత్తు అంటూ ఉదయభాను చెప్పిన ఇన్స్పిరేషనల్ వర్డ్స్ కి అందరూ ఫిదా అవుతున్నారు.

Jayam serial : గంగ, రుద్ర పూజలో కూర్చుంటారా.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -164 లో..... రుద్ర ఏ విధంగా గంగకి హెల్ప్ చేసాడో అందరికి చెప్తాడు. పాపం పెద్దమ్మ హర్ట్ అయినట్లు ఉందని వంశీ అనగానే అయితే అవనివ్వులే గంగ సేఫ్ అయిందని పెద్దసారు అంటాడు. మరొకవైపు పారు ఫ్రెండ్స్ ని అకాడమీ మేడమ్ సస్పెండ్ చేస్తుంది. దాంతో నువ్వు సస్పెండ్ ఆపకపోతే నువ్వే ఇదంతా చేసావని మేడమ్ కి చెప్తానని పారు ఫ్రెండ్ పారుతో అంటుంది. దాంతో మేడమ్ ని సస్పెండ్ క్యాన్సిల్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తుంది పారు. తప్పు ఒప్పుకుంటున్నారు కదా ఈ ఒక్కసారి క్షమించండి అని మేడమ్ తో గంగ అనగానే తను సరే అని సస్పెన్షన్ క్యాన్సిల్ చేస్తుంది.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.