English | Telugu

Shekhar basha reveals about manikanta: మణికంఠ వస్తువులు చూసి అలాంటోడని అనుకోలేదు!

బిగ్ బాస్ హౌస్ లో ఎమోషనల్ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే అందరికి ఠక్కున గుర్తొచ్చే పేరు మణికంఠ. ఎందుకంటే మొదటివారమే తన ఫ్యామిలీ సెంటిమెంట్ తో ప్రేక్షకులను కట్టిపడేసాడు.

మణికంఠ హౌస్ లో అంత పర్ఫెక్ట్ అనిపించిన కానీ కంటెస్టెంట్స్ కి తను అంటే కొంచెం చులకన భావం కన్పిస్తుంది. ఎందుకంటే ప్రతీసారీ తన ఎమోషన్ ని బయటపెట్టి సింపథీ కార్డు యూజ్ చేస్తున్నాడు. కానీ గేమ్ పరంగా పర్లేదు.. మళ్ళీ నామినేషన్ లలో అన్నీ పనికిరాని రీజన్స్ తో అడ్డంగా బుక్కవుతున్నాడు. ఇప్పుడిప్పుడే మనుషుల్లో కలవడానికి వస్తున్నాను.. నా మైండ్ సెట్ కాస్త డిఫరెంట్ ఉంటదని మణికంఠనే చాలాసార్లు చెప్పాడు.

బిగ్ బాస్ సీజన్-8 లో మొదటగా బెజవాడ బేబక్క ఎలిమినేట్ ఇవ్వగా సెకెండ్ వీక్ శేఖర్ బాషా ఎలిమినేట్ అయ్యాడు. అయితే విచిత్రమేంటంటే వీరిద్దరు కలిసి హౌస్ లోకి వెళ్ళారు. బయటకు ఒకరి తర్వాత ఒకరు వచ్చారు. ఇక ఎవరు ఊహించని విధంగా హౌస్ ల్ నుండి శేఖర్ బాషా బయటకు వచ్చాడు. ఇది నిజంగా అన్ ఫెయిర్ అనే చెప్పాలి. శేఖర్ బాషా హౌస్ నుండి బయటకు వచ్చాక తెలుగువన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మణికంఠ గురించి కొన్ని నిజాలు బయటపెట్టాడు. మణికంఠ ఎలా ఉండేవాడని అడగ్గా... తను చాలా డిఫరెంట్ మనుషుల్లో కలిసేవాడు కాదని అన్నాడు. ఎప్పుడు నేను మణికంఠ ఒకే బెడ్ పై పడుకుంటాం కానీ ఒక్కొక్కసారి నేను సోఫాపై పడుకుంటా ఒకరోజు సడెన్ గా రాత్రి బెడ్ దగ్గరికి వెళ్ళాను. అక్కడ అమ్మాయికి వాడే కాటుక, విగ్గు చూసి షాక్ అయ్యానని శేఖర్ బాషా చెప్పుకొచ్చాడు. మణికంఠ ఒకానొక సందర్భంలో ఎమోషనల్ అవుతూ.. తన విగ్గుని తీసిపారెస్తూ.. ఇంతకంటే ట్రాన్స్ పరెంట్ గా ఉండలేనని అన్నాడు. అది చూసి కంటెస్టెంట్స్ తో సహా ప్రేక్షకులు కూడా అది విగ్గా అంటు ఆశ్చర్యపోయారు.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.