English | Telugu
రాహుల్ రాలేదని రచ్చ చేసిన స్వప్న.. రుద్రాణిపై దుగ్గిరాల ఫ్యామిలీ సీరియస్!
Updated : Jun 25, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -131 లో.. అప్పుని షాపింగ్ కి తీసుకెళ్తాడు కళ్యాణ్. అలా వాళ్ళిద్దరు నడుచుకుంటూ వస్తుంటే ఇద్దరు దుండగులు కత్తితో బెదిరిస్తారు. కత్తిని చూసిన కళ్యాణ్ భయపడతాడు. కానీ అప్పు ఒక దుండగుడిని కొట్టగానే మరొకడు పారిపోతాడు. ఆ తర్వాత అప్పు వాడిని వదిలేసి.. ఇంత భయపడేవాడివి రేపు పొద్దున పెళ్ళి అయ్యాక నీ భార్యని ఎలా చూసుకుంటావని అడుగుతుంది. నేను నీలా పెరగలేదు, చాలా స్మూత్ గా పెరిగానని కళ్యాణ్ అనగా.. సరే రేపటి నుండి గ్రౌండ్ కి వచ్చేయ్ నీకు ట్రైనింగ్ ఇస్తానని అప్పు అంటుంది.
మరొకవైపు కనకం, మీనాక్షి కలిసి ఇంటిపత్రాల కోసం సేట్ తలమీద కొట్టగా స్పృహతప్పి పడిపోతాడు. కాసేపటికి లేచిన సేటు.. కనకం, మీనాక్షి ఇద్దరిని తిడతారు. మీరు మమ్మల్ని తిడుతున్నారు కానీ హెల్ప్ కావాలని అడగట్లేదని మీనాక్షి అనగానే.. అవును కదా మరిచిపోయానని చెప్పి సేటు అరుస్తాడు. దాంతో వెంటనే కనకం తన చేతిలోని మత్తు ఉన్న కర్ఛీఫ్ ని సేట్ కి చూపించి మత్తులోకి జారేలా చేస్తుంది. మీనాక్షికి మత్తు గురించి చెప్తుంది కనకం. అది నిజమేనా అని చూడగా తను కూడా మత్తులోకి జారుకుంటుంది. దుగ్గిరాల ఇంట్లో ఉన్న కావ్య తనకి రాజ్ సీక్రెట్ గా పరుపు తెచ్చినందుకు బెడ్ మీద మల్లెపూలతో థాంక్స్ అని రాస్తుంది. అది చూసిన రాజ్.. నాకు ఇలాంటివి నచ్చవని తీసేయమని చెప్తాడు. ఇద్దరు కాసేపు గొడవపడతారు.
మరొకవైపు కొత్త కోడలిగా అడుగుపెట్టిన స్వప్న గ్లామర్ గా రెడీ అయి ఉంటుంది. నీట్ గా చీర కట్టుకొని, సెంట్ కొట్టుకొని రాహుల్ కోసం ఎదురుచూస్తుంటుంది. టైం పది దాటినా రాహుల్ రాకపోయేసరికి విసుగుచెందుతుంది స్పప్న. వెంటనే ఇంటికి డోర్ దగ్గర ఉన్న కాలింగ్ బెల్ కొడుతూ అందరూ హాల్లోకి వచ్చేలా చేస్తుంది. ఆ తర్వాత ఏమైందని అందరూ స్వప్నని అడుగగా.. రాహుల్ ఈ టైం అయినా ఇంటికి రాలేదు. నాకు కోరికలు ఉంటాయి కదా అని స్వప్న అనగా.. వాడు మగాడు, బయట సవాలక్ష పనులుంటాయని రుద్రాణి అంటుంది. నాకు తెలియని పనులా అత్త అని రాజ్ అంటాడు. ఆ తర్వాత రాహుల్ ప్రతీరోజు ఇలానే లేట్ గా వస్తాడా అని రుద్రాణిని స్వప్న అడుగుతుంది. పక్కనే ఉన్న అపర్ణ.. సమాధానం చెప్పు రుద్రాణి అని అడుగుతుంది. దాంతో రుద్రాణి మౌనంగా ఉంటుంది. కాసేపటికి సీతారామయ్య దగ్గరికి స్వప్న వెళ్ళి.. "సారీ తాత గారు.. నేను బలవంతంగా రాహుల్ ని పెళ్ళిచేసుకున్నానని నన్ను ఇలా పట్టించుకోవడం లేదు, అందుకే నా బాధ మీకు తెలియాలనే ఇలా చేసాను" అని అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.