English | Telugu

సుమ అడ్డా షోలో మహేష్-సాండ్రా పెళ్లి.. 

బుల్లితెర మీద మహేష్ కాళిదాసు - సాండ్రా గురించి అందరికీ తెలుసు. ఇక వీళ్ళ ప్రేమ, పెళ్లి గురించి తమ ఫాన్స్ అందరికీ కూడా చెప్పారు. ఐతే వీళ్ళు సుమ అడ్డా షోకి వచ్చారు. రీసెంట్ గా రిలీజయిన నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ కి వీళ్ళు రాబోతున్నారు. ఈ ప్రోమో ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంది. రాగానే సుమ వీళ్లకు ఒక గ్లాస్ లో డ్రింక్ పోసి రెండు స్ట్రాలు కూడా వేసి ఇచ్చింది. ముందు సాండ్రా ఆ డ్రింక్ తాగి ఇచ్చింది. "చూసారా ఇదే నా స్ట్రా.." అన్నాడు. దాంతో సుమ "అబ్బా అబ్బా" అంటూ ఒక లాంగ్ అండ్ ఫన్నీ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. ఒక టాస్క్ లో "ఇంకా ప్రేమలో ఎం చేస్తారు అని అడిగేసరికి" "ఇంకేం చేస్తారు ముద్దులు పెట్టుకుంటారు " అని చెప్పాడు మహేష్. దాంతో ఒక్కసారిగా సుమా షాకయ్యింది. ఇక భార్యల్ని పిలిచి "కొత్త జంట అనగానే మనకు గుర్తొచ్చేది ఏమిటి" అని సుమ అడిగేసరికి మహేష్ వెంటనే "ముద్దులు ముద్దులు" అని మళ్ళీ ఆన్సర్ చెప్పేసాడు.

ఇక తర్వాత అందరూ కలిసి వీళ్లకు స్టేజి మీద పెళ్లి చేసేసారు. జీలకర్ర బెల్లం పెట్టుకున్నట్టు ఒక పోజ్ లో సాండ్రా మహేష్ తల మీద చెయ్యి పెట్టేసరికి సుమ వెంటనే అలెర్ట్ అయ్యి " ఏమ్మా గట్టిగా లాగకూడదు బిట్ ఊడిపోతుంది " అంటూ చెప్పేసరికి అందరూ నవ్వేశారు. తర్వాత తాళి కట్టాడు మహేష్. ఇక కనకాంబరాలు, గులాబీ రేకుల్ని అక్కడ పెట్టేసరికి తలంబ్రాలు పోసుకున్నట్టు పోసుకున్నారు. సాండ్రా ఐతే మహేష్ మొహం మీద గట్టిగా కొట్టింది పూలతో. అంతే సుమ మధ్యలో వచ్చి "ఏంటమ్మా పొద్దున్నే చెత్త మొహాన కొట్టినట్టు" అనేసింది. ఇక ఫైనల్ గా సాండ్రాని ఎత్తుకుని అరుంధతి నక్షత్రాన్ని కూడా చూపించేసాడు. తర్వాత రాపిడ్ ఫైర్ రౌండ్ లో "వీరిలో ఎక్కువ ఎవరికీ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఏ. మీ ఆవిడకి బి. మీ పేరెంట్స్ కి " అని సుమా అడిగింది. మహేష్ ఆన్సర్ చెప్పలేక టాయిలెట్ కి వెళ్ళొస్తా అనేశాడు. దాంతో సుమ "మేము పంపించం" అనేసింది. "ఈ రెండిట్లో ఒకటి ఆపేయాలంటే ఏది ఆపేస్తారు ఏ. యాక్టింగ్ బి. మీ యూట్యూబ్ ఛానెల్ " అని అంది. దాంతో సాండ్రా "ఈ యూట్యూబ్ ఆపేసి వేరేది స్టార్ట్ చేస్తా" అంటూ వెరైటీ ఆన్సర్ ఇచ్చింది.