English | Telugu
సుమ అడ్డా లో సోనియా సీమంతం..
Updated : Oct 30, 2025
సుమ అడ్డా షో నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయింది. ఈ షోని కపుల్స్ స్పెషల్ ఎపిసోడ్ గా డిజైన్ చేశారు. ఈ షోకి మహేష్ - సాండ్రా, యష్-సోనియా, పవన్ కళ్యాణ్ - వాసంతి కృష్ణన్ వచ్చారు. ఇక ఈ షో ప్రోమో చూస్తే సోనియాకి సీమంతం ఎంతో ఘనంగా చేశారు. "ఒక పవర్ ఫుల్ అమ్మాయితో చేతుల మీదుగా ఇలా సీమంతం చేసుకోవడం బాగుంది. మీ బ్లేసింగ్స్ కావాలి. మీ లాగా నాకు పుట్టబోయే అమ్మాయి కూడా మీలా ఎన్నో అచీవ్ చేయాలని కోరుకుంటున్నా. యష్ లాంటి ఒక స్ట్రాంగ్ పిల్లర్ ఉంటే సపోర్ట్ గా ఉంటే ఏ అమ్మాయైనా ఆకాశమంత ఎత్తు ఎదగొచ్చు, ఏదైనా సాధించొచ్చు కూడా. ఈ విషయాన్ని నేను చాలా స్ట్రాంగ్ గా నమ్ముతాను.
అందరమ్మాయిలకు కూడా ఇలాంటి ఒక సపోర్టివ్ స్ట్రాంగ్ మెన్ ఉండాలి" అని కోరుకుంది. ప్రోమో స్టార్టింగ్ లో ఐతే ప్రతీ జంటకు ఒక గ్లాస్ లో డ్రింక్ పోసి రెండు స్ట్రాలు వేసి ఇచ్చింది. సోనియా తాగేస్తుందేమో అనుకుని యష్ గబగబా తాగేస్తుంటే సుమ కౌంటర్ వేసింది "ఆవిడ తాగేస్తుందేమో అని తొందరగా తాగేయొద్దు" అనేసరికి అందరూ నవ్వేశారు. తర్వాత భార్యల్ని ఒకవైపు, భర్తల్ని ఒక వైపు పెట్టి టాస్కులు ఆడించింది సుమ. "మీరు మీ భార్యను ఎంత ప్రేమిస్తున్నారో చెప్పండి యష్ గారు" అని సుమ అడిగేసరికి "వీళ్లిద్దరి కంటే ఎక్కువ" అన్నాడు. "ఇప్పటి వరకు మీ వైఫ్ కి కూడా తెలియనటువంటి ఒక విషయం పాస్ట్ లో ఉన్న మీ లవ్ స్టోరీ వైఫ్ కి తెలీకుండా దాచిన ప్రెజెంట్ లవ్ స్టోరీ" ఏంటి అని యష్ ని అడిగేసరికి సోనియా కూడా షాకయ్యింది. యష్ మాత్రం ఏమీ ఆన్సర్ చెప్పలేక నవ్వుకున్నాడు.