English | Telugu

పవరస్త్రని సాధించిన తొలి కంటెస్టెంట్ ఆట సందీప్.. ప్రియాంక జైన్ మిస్!

సోమవారం నుండి శుక్రవారం వరకు కంటెస్టెంట్స్ మధ్య నామినేషన్లు, టాస్క్ లు, గేమ్స్ ఇలా రకరకాల పరీక్షలు పెడతారు బిగ్ బాస్. ఇక వీకెండ్ వచ్చిందంటే హోస్ట్ నాగార్జున గారు వచ్చేస్తారు.‌ ఇక వీక్ లో‌ జరిగేందేంటి? ఎవరెవరు ఏమేమీ చేస్తున్నారంటూ అన్నీ ఆరాలు తీస్తూ, కంటెస్టెంట్స్ కి ఛివాట్లతో పాటు ప్రశంసలు కురిపిస్తాడు నాగార్జున.

ఇప్పటికే నామినేషన్లో ఎనిమిది మంది కంటెస్టెంట్స్ ఉండగా అందులో ఈ రోజు ఒకరు ఎలిమినేట్ అవుతారని తెలుస్తుంది. ‌కాగా ప్రేక్షకులు వేసే ఓటింగ్ లో లీస్ట్ కిరణ్ రాథోడ్, సింగర్ దామిణి ఉన్నారు. ప్రిన్స్ యావర్ కూడా డేంజర్ జోన్ లో‌ ఉన్నాడు. అయితే మొన్న జరగిన ఇమ్యూనిటి టాస్క్ లో రతిక, శివాజీ ఓడిపోయారు. మిగిలింది ప్రియాంక జైన్, ఆట సందీప్. వీరిద్దరిలో ఎవరు పవరస్త్రమి సాధిస్తారనే ఆసక్తిలో శుక్రవారం ముగిసింది.‌ కాగా శనివారం నాటి ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున వచ్చి ఒక్కొక్కరి గురించి చెప్పి ఈ టాస్క్ ని కూడా చూపించాడు.

ఫైనల్ బ్యాటిల్ ఫర్ పవరస్త్రలో ఒక స్టాండ్ మీద ఒకవైపు ప్రియాంక జైన్, మరొకవైపు ఆట సందీప్ ఉన్నారు. కొంత సమయం ఇచ్చి ఆ టైమ్ లో బాస్కెట్ లో ఎవరెన్ని బాల్స్ వేస్తారో వారే విజేత అని నాగార్జున చెప్పగా.. ఆ టాస్క్ లో ఆట సందీప్ విజేతగా నిలిచాడు. కాగా ప్రియాంక జైన్ మిస్ అయింది. ఆ తర్వాత పవరస్త్రని ప్రియాంక జైన్ చేతులమీదుగా ఆట సందీప్ కి ఇవ్వమని నాగార్జున చెప్పాడు. అలా ఆట సందీప్ పవరస్త్రని సాధించి బిగ్ బాస్ సీజన్-7 లో మొదటి హౌజ్ మేట్ గా ఎన్నికయ్యాడు‌. ఇక మిగిలిన వాళ్ళు కంటెస్టెంట్స్ మాత్రమే అని తెలుస్తుంది. ఇదే ఉల్టా పల్టా బిగ్ బాస్ సీజన్-7 అని స్పష్టంగా తెలుస్తుంది. అయితే అయిదు వారాల పాటు
ఎలిమినేషన్ లేకుండా హౌజ్ లోనే ఉండే పవర్ ని ఆట సందీప్ దక్కించుకున్నాడు. అయితే ఆదివారం రోజు రాత్రి జరిగే ఎపిసోడ్‌లో ఎలిమినేషన్ ఉంటుందా? ఉండదా అనే సస్పెన్స్ తో బిగ్ బాస్ సీజన్-7 ప్రేక్షకులకు సరికొత్త థ్రిల్ ని ఇస్తుంది.