English | Telugu

పల్లవి ప్రశాంత్, రతికరోజ్ ల ప్రేమాయణం గురించి అడిగిన హోస్ట్!

బిగ్ బాస్ సీజన్-7 ఈ సారి సరికొత్త ట్విస్ట్ లతో ఆధ్యాంతం ఆసక్తికరంగా సాగుతుంది. గత సీజన్-6 లో కామన్ మ్యాన్ గా అడుగుపెట్టిన ఆదిరెడ్డికి అత్యధిక ఫ్యాన్ బేస్ ఉందనే విషయం అందరికి తెలిసిందే. అదే కోవలోకి పల్లవి ప్రశాంత్ చేరాడు. తెలంగాణ రైతు బిడ్డ.. బియ్యం బస్తాతో బిగ్ బాస్ సీజన్-7 లోకి అడుగుపెట్టాడు పల్లవి ప్రశాంత్.

బిగ్ బాస్ హౌజ్ లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిఉన్న ఒకే ఒక కంటెస్టెంట్ పల్లవి ప్రశాంత్. నామినేషన్లో ఉన్న ఎనిమిది మందిలో ఓటింగ్ లోనూ పల్లవి ప్రశాంత్ టాప్ లో దూసుకెళ్తున్నాడు. బిగ్ బాస్ హౌజ్ లోకి కామన్ మ్యాన్ గా ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ కంప్లీట్ వేరే లెవెల్ ఆట ఆడుతున్నాడు. కొందరేమో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని అంటే, మరికొందరు ఫేక్ అని అంటున్నారు. అయితే పల్లవి ప్రశాంత్ జెన్యున్ కంటెస్టెంట్ అని ప్రేక్షకులు ఇచ్చిన మార్కుల్లో తెలుస్తుంది. ఇప్పటివరకు హౌజ్ లో ఉన్నవాళ్ళ గురించి ఆడియన్స్ కి ఓటింగ్ పెట్టాడు బిగ్ బాస్. అయితే ఇందులో వంద మార్కులకి గాను పల్లవి ప్రశాంత్ తనకి తాను 78 ఇచ్చుకోగా, ప్రేక్షకులు 74 ఇచ్చారు. దీంతో నాగార్జున సూపర్ అంటూ ప్రశంసల వర్షం కురిపించాడు.

అయితే మొన్న జరిగిన ఇమ్యూనిటి టాస్క్ లో.. ' అంత బాడీ ఉన్న అతడిని చూసి నిన్ను కొన్ని క్షణాల్లో అవతల పడేస్తాడేమో అనుకున్నాను, కానీ నువ్వు గట్టి పోటీ ఇచ్చావ్.. రియల్లీ యూ ఆర్ అమేజింగ్ పవర్' అంటూ పల్లవి ప్రశాంత్ పై ప్రశంసలు కురిపించాడు నాగార్జున. ఇక హౌజ్ లోకి వచ్చాక నీకొకటి ఇచ్చాను ఏం చేశావ్ దానిని అని పల్లవి ప్రశాంత్ ని నాగార్జున అడుగగా.. బాగా చేసుకుంటున్నానని పల్లవి ప్రశాంత్ అన్నాడు. బాగా చూసుకుంటున్నావా? ఒక మూలన పెట్టావని నాగార్జున అడుగగా.‌. లేదు సర్ నేను ఒక దగ్గర పెడితే మళ్ళీ వీళ్ళు మారుస్తున్నారంటూ చెప్పాడు. ఇక రోజు లేచాక, పడుకునే ముందు వెళ్ళి దండం పెట్టుకుంటున్నానని పల్లవి ప్రశాంత్. బాగా చూసుకునేది మనిషిని కాదు మొక్కని అని నాగార్జున అనడంతో హౌజ్ లో అందరూ నవ్వేసారు. అయితే ఇప్పుడు బిగ్ బాస్ సీజన్-7 లో లవ్ ట్రాక్ నడుస్తుందంటే అది పల్లవి ప్రశాంత్ ,రతికలదే అని అందరికి తెలిసిన విషయమే. కాగా శుభశ్రీ, గౌతమ్ కృష్ణల మధ్య మరో లవ్ స్టోరీ ఉందా? లేదా అన్న డైలమాలో సాగుతుంది. కాగా ఈ ఉల్టా పల్టా థీమ్ తో వచ్చి‌న బిగ్ బాస్ సీజన్-7 లో ఆదివారం జరిగే ఎపిసోడ్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి మరి.

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..