English | Telugu
బిగ్ బాస్ హౌజ్ లో రతికరోజ్ కి ప్రశంసల వర్షం!
Updated : Sep 10, 2023
బిగ్ బాస్ సీజన్-7 లో చాలా మార్పులు వచ్చాయి. రోజురోజుకి ఆసక్తికరంగా మారుతుంది. గత సీజన్ మాములుగా ఉందని అందరికీ తెలిసిందే. అయితే ఈ సారి కంటెంట్ మార్చిన బిగ్ బాస్.. కొత్తగా ఉల్టా పల్టా థీమ్ తో ఏ కంటెస్టెంట్స్ పర్మెనెంట్ గా అంటే బిగ్ బాస్ చివర వరకు ఉంచకుండా.. అసలు హౌజ్ మేట్ గా కన్ఫమ్ కాకుండా తీసుకొచ్చారు. బిగ్ బాస్ హౌజ్ లో హౌజ్ మేట్ అవ్వాలంటే అర్హత సాధించుకోవాలని బిగ్ బాస్ చెప్పాడు.
కాగా ఈ మొదడి కంటెస్టెంట్ ని కన్ఫమ్ చేయడానికి బిగ్ బాస్ గడిచిన వారమంతా టాస్క్ , హౌజ్ లో ఉన్నవాళ్ళంతా కలిసిపోయారా, ఫియర్ లెస్ గా ఎవరు ఉన్నారు, జెన్యున్ గా ఎవరు హౌజ్ లో అందరితో ఉండగలిగారంటూ ఒక ఓటింగ్ పోల్ ని బిగ్ బాస్ పెట్టగా అత్యధిక ఓట్లు పల్లవి ప్రశాంత్ కి వచ్చాయి. కాగా రతికరోజ్ తర్వాతి స్థానంలో ఉంది. అయితే మొన్నటి ఇమ్యూనిటి టాస్క్ లో కంటెస్టెంట్ కి సపరేట్ గా టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. అయితే అందులో.. రతికరోజ్ ని బిగ్ బాస్ యాక్టివిటి ఏరియాకి పిలిచి, తనకో టాస్క్ ఇచ్చాడు. ఆ టాస్క్ దాదాపుగా రెండున్నర గంటల సమయం జరిగింది. అయితే ఆ టైమ్ రతికరోజ్ ఏం చేసిందని? ఆ టాస్క్ ఏంటని హౌజ్ మేట్స్ ఒక డైలామాలో ఉన్నారు. సీక్రెట్ టాస్క్ బిగ్ బాస్ ఇచ్చారేమో అని అనుకున్నారంత. దాంతో మొన్నటి టాస్క్ తర్వాత ఇసుకని అనర్హులని భావించిన వారి ముందున్న డబ్బాలో పోయమని కంటెస్టెంట్స్ తో బిగ్ బాస్ చెప్పగా.. మెజారిటీ ఆఫ్ ది కంటెస్టెంట్స్ రతికరోజ్ అనర్హురాలని ఓట్ చేశారు.
అయితే అసలు విషయం ఏంటంటే.. శనివారం జరిగిన ఎపిసోడ్‌లో నాగార్జున వచ్చి ఒక్కో కంటెస్టెంట్ యొక్క పర్ఫామెన్స్, హౌజ్ లో వారి ప్రవర్తన గురించి తెలుసుకున్నారు. కాగా రతికరోజ్ కి నాగార్జున ప్రశంసల వర్షం కురిపించాడు. అసలు రతికరోజ్ కి ఇచ్చిన టాస్క్ ఏంటో కంటెస్టెంట్స్ కి అర్థమయ్యేలా చెప్పాడు నాగార్జున. 'ఉడతా ఉడతా ఊచ్.. ఎక్కడికెళ్ళావోచ్' అనే పాటని ఒక మూడు, నాలుగు సార్లు ప్లే చేసి, ఇందులో ఎన్నిసార్లు పాట ప్లే అయిందని నాగార్జున అడుగగా.. కంటెస్టెంట్స్ లోని ఎవరూ సరైన సమాధానం చెప్పలేదు. దాంతో నాగార్జున చెప్తూ.. ఆ రోజు రతికరోజ్ కి ఈ పాటని రెండున్నర గంటల పాటు లూప్ లో వినిపించారు బిగ్ బాస్. అయితే ఈ పాటని ఎందుకు అలా వినిపిస్తున్నారో తనకీ తెలియదు. అయితే పాట ప్లే అవ్వడం పూర్తయ్యాక ఈ పాటలో ఉడుత అనే వర్డ్ ఎన్నిసార్లు వచ్చిందని బిగ్ బాస్ అడుగగా.. 1056 సార్లు ఉడుత అనే పేరు వచ్చిందని రతికరోజ్ కౌంట్ చేసి చెప్పింది. షీ ఈజ్ మోస్ట్ యునిక్ అండ్ ఇంటలిజెంట్. ఐఏఎస్ కి అర్హత సాధించేంత సత్తా రితికరోజ్ కి ఉందని నాగార్జున చెప్పాడు. అది తెలుసుకున్న కంటెస్టెంట్స్ అంతా షాక్ అయ్యారు. ఆ తర్వాత చప్పట్లతో తమ అభినందనలు తెలిపారు.