English | Telugu

గంగవ్వ దెబ్బకి లేడి కంటెస్టెంట్స్ బెంబేలు.. కనిపెట్టేసిన పృథ్వీ!

బిగ్‌బాస్ హౌస్‌లో గంగవ్వ చేసిన ఘోస్ట్ ప్రాంక్ దెబ్బకి కంటెస్టెంట్లు షాక్ అయ్యారు. అసలు గంగవ్వ అయితే యాక్టింగ్ ఇరగదీసింది. అయితే ఇది పక్కాగా ప్రాంక్‌ యే అని హౌస్ మేట్స్ అందరిలో ఒకే ఒక్క కంటెస్టెంట్ కనిపెట్టాడు. బిగ్‌బాస్ హౌస్‌లో నిన్న జరిగిన ఎపిసోడ్ లో గంగవ్వ హైలైట్ గా నిలిచింది. కంటెస్టెంట్లను భయపెట్టడంలో నూటికి నూరు మార్కులు తెచ్చుకుంది గంగవ్వ.

కామెడీ మాట పక్కన పెడితే ఓ హార్రర్ సినిమా అయితే చూపించింది. అన్నీ తామే అంటూ ముందుగా చెప్పిన అవినాష్-టేస్టీ తేజ.. గంగవ్వ యాక్షన్ చూశాకా జడుసుకున్నారు. ముందుగా కెమెరాతో తాము ఒక ఘోస్ట్ ప్రాంక్.. చేయాలనుకుంటున్నాం.. ఈ విషయం గంగవ్వ, నాకు, అవినాష్‌కి మాత్రమే తెలుసంటు బిగ్ బాస్ కి టేస్టీ తేజ చెప్పాడు. తర్వాత అటు అవినాష్, ఇటు తేజ ఇద్దరూ గంగవ్వకి ప్రాంక్ గురించి చెప్పి.. ఇలా యాక్ట్ చెయ్ అలా చెయ్ అంటూ సలహాలు ఇచ్చారు. ఇంకేముంది గంగవ్వ రెచ్చిపోయింది. అర్ధరాత్రి అందరూ మంచి నిద్రలో ఉండగా నెమ్మదిగా నడిచొచ్చి యాక్టివిటీ ఏరియాలో జుట్టు విరబూసుకొని కూర్చుంది. తర్వాత ఏదో దెయ్యం పట్టినట్లు అరవడంతో ఒక్కో కంటెస్టెంట్ ఏమైందిరా అంటూ లేచారు. అవినాష్, తేజ అయితే తమ జబర్దస్త్ యాక్టింగ్ అంతా చూపించారు. గంగవ్వ అలా చేయకగానే రోహిణి దగ్గరికెళ్లి అవ్వా ఏమైంది అంటూ హగ్గు ఇవ్వబోయింది. దీంతో ఒకసారి చేయి జాడించింది గంగవ్వ. దీంతో రోహిణి దెబ్బకి మళ్లీ దగ్గరికి రాలేదు. తర్వాత ఇలానే కాసేపు గంగవ్వ అరుపులు కంటిన్యూ చేసింది. అందరూ దూరంగా అలా నిల్చొనే ఉండిపోయారు. తర్వాత తేజ-అవినాష్ ఇద్దరూ గంగవ్వను బెడ్ మీదకి తీసుకెళ్లి పడుకోబెట్టేశారు.

ఇక ఇదంతా చూసిన కంటెస్టెంట్లు ఒక్కొక్కరు ఒకో స్టోరీ మొదలెట్టేశారు. సైకలాజికల్‌గా ఏదో డిస్ట్రబ్ అయింది.. కళ్లల్లో కనిపిస్తుందంటూ గౌతమ్ చెప్పాడు.ముఖ్యంగా లేడీ కంటెస్టెంట్లు అయితే చాలా భయపడ్డారు. ఎలా పడుకోవాలబ్బా నాకు కాళ్లు చేతులు వణుకుతున్నాయి.. అంటూ హరితేజ అంది. నాకు కూడా.. నాకు ఒకలా అయిపోయింది.. గంగవ్వ కళ్లు కూడా తెరవలేదు.. నిద్రలోనే స్లీప్ వాకింగా అంటూ రోహిణి అంది. మరి డోర్ తీసుకొని అలా చేసింది.. సీక్రెట్ టాస్క్ అనుకున్నానంటూ హరితేజ చెప్పింది. కావాలని చేసినా అంత పర్ఫామెన్స్ రాదు.. తెలీకుండానే చేసిందంటూ రోహిణి చెప్పుకొచ్చింది. మరోవైపు పృథ్వీకి చెబుతూ గంగవ్వకి అంత పవర్ అంత ఎనర్జీ ఉందని నాకు తెలీదంటూ గొప్పగా చెప్పింది హరితేజ. దీంతో గంగవ్వ మైక్ తీసుకునే పడుకుంటుంది రోజు.. కానీ మైక్ వేసుకుందని అంటున్నారు కదా.. ఖచ్చితంగా అది ప్రాంకే.. లేకపోతే మైక్ వేసుకొని ఎందుకు చేస్తుంది.. ముగ్గురు ఎవరో ప్లాన్ చేసి ఉంటారంటూ పృథ్వీ కనిపెట్టేశాడు.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...