English | Telugu

రేవంత్, ఫైమాల మధ్య సిల్లీ లొల్లి!

బిగ్ బాస్ సీజన్ - 6 పూర్తి కాబోతుంది. దీంతో రోజు రోజుకి హౌస్ లో కంటెస్టెంట్స్ ఇచ్చే పర్ఫామెన్స్ వల్ల విజేత ఎవరు? అని అంచనాలు తారుమారు అవుతున్నాయి. దీంతో హౌస్ లో కెప్టెన్సీ టాస్క్ రసవత్తరంగా సాగింది. సీజన్ లో హౌస్ లో చివరి కెప్టెన్సీ టాస్క్ కావడంతో హౌస్ మేట్స్ అందరూ కూడా నువ్వా నేనా అంటూ పాల్గొన్నారు.

అయితే టాస్క్ లో రేవంత్, ఫైమా మధ్య మొదలైన గొడవ టాస్క్ ముగిసాక ఎక్కువ అయ్యింది. టాస్క్ లో బాల్ రేవంత్ చేతిలో ఉండగా ఫైమాని టాస్క్ నుంచి తొలగించాడు. "తను ఆల్రెడీ కెప్టెన్ అయ్యింది. మళ్ళీ ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉంది" అని ఫైమాను గేమ్ నుండి తప్పించాడు రేవంత్.

రేవంత్ చెప్పిన కారణం తనకు నచ్చలేదు అని ఫైమా చెప్పింది. అదే విషయమై టాస్క్ ముగిసాక ఫైమా మిగతా హౌస్ మేట్స్ తో "ఒకరు సిల్లీ రీజన్ చెప్పి నన్ను తొలగిస్తే, వాళ్ళని కూడా వేరే వాళ్ళు సిల్లీ రీజన్ చెప్పి తొలగిస్తే ఆ హ్యాపీనే వేరు" అంటూ రేవంత్ కి వినిపించేలా ఫైమా మాట్లాడింది. దీంతో రేవంత్ కోపంతో "నువ్వు టాస్క్ నుండి వెళ్ళిపోతే మిగతా వాళ్ళు కూడా వెళ్లిపోవాలని అనుకుంటావ్. నీ బుద్ధే అంత" అంటూ కౌంటర్ ఇచ్చాడు. దానికి బదులుగా ఫైమా రేవంత్ ని రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా, వదిలేసాడు. తను చాలా వరకు తన కోపాన్ని తగ్గించుకున్నాడు.

రేవంత్, ఫైమా ఇద్దరి మధ్యలో మాటల యుద్ధం కొద్ది సేపటి వరకు కొనసాగింది. అయితే డేంజర్ జోన్ లో ఉన్న ఫైమా ఈ వారం ఎలిమినేషన్ అయ్యే ఛాన్స్ లు ఎక్కువ ఉన్నాయి. ఇలాంటి టైం లో గొడవలు పెట్టుకుంటే తను ప్రేక్షకుల దృష్టిలో ఇంకా నెగెటివ్ అయ్యే అవకాశాలు లేకపోలేదు.