English | Telugu

ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు స్టయిల్లో అవినాష్ డైలాగ్

కామెడీ షోస్ అన్నిటినీ బీటౌట్ చేయడానికి ‘‘కామెడీ స్టాక్ ఎక్స్చేంజి’’ పేరుతో ఆహాలో సరికొత్త కామెడీ షో రాబోతోంది. ఈ షోకి హోస్ట్స్ గా సుడిగాలి సుధీర్, దీపికా పిల్లి ఉన్నారు. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, కామెడీ స్టార్స్, శ్రీదేవి డ్రామా కంపెనీలో కనిపించే చాలామంచి కమెడియన్స్ ఈ షోలో ఎంటర్టైన్ చేయడానికి వచ్చారు. ఈ షో డిసెంబర్ 2 నుంచి ఆహాలో స్ట్రీమ్ కాబోతోంది. ఇప్పుడు దీనికి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక ఈ ఎపిసోడ్ లో మొత్తం కూడా స్కూల్ , క్లాస్ రూమ్ బ్యాక్ డ్రాప్ లో కామెడీని అందించారు కమెడియన్స్.

ఇక ఇందులో సీనియర్ మోస్ట్ కమెడియన్ వేణు వండర్స్ వచ్చి "నా చిన్నప్పుడు స్కూల్స్ అనేవి "గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి.." అనేలా ఉంటే ఇప్పుడు స్కూల్స్ మాత్రం " గున్నాగున్నా మామిడి.." అనేలా ఉన్నాయి అని చెప్పి ఎంటర్టైన్ చేసాడు. ఇక తర్వాత సుధీర్ కామెడీ క్లాస్ రూమ్ పేరుతో ఒక స్కిట్ వేసాడు. సుధీర్ మాస్టర్ గా మిగతా కమెడియన్స్ స్టూడెంట్స్ గా ఉన్నారు. సుధీర్ "రా..రా.."అని సద్దాంని పిలిచేసరికి "ఎక్కాసెక్క" అని సాంగ్ పాడి కామెడీ చేసాడు. దాంతో మిగతా స్టూడెంట్స్ లేచి ఫన్ చేశారు. సుధీర్ వెంటనే కర్ర తీసుకుని అందరినీ కొడుతూ అవినాష్ దగ్గరకు వెళ్లేసరికి " ఏయ్ ..ఎలా కొడతారు మీరు, ఏ విధంగా కొడతారు మీరు" అని ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు స్టయిల్లో మాట్లాడేసరికి అందరూ నవ్వేశారు.