English | Telugu

కీర్తి.. నువ్వు నా కూతురు లాంటి దానివి.. కాదు నా కూతురు వే!


ఫ్యామిలీ వీక్ లో భాగంగా బిగ్ బాస్ హౌస్ 'ఫుల్ ఆఫ్ ఎమోషన్స్' గా సాగుతోంది.బిగ్ బాస్ హౌస్ లో రేవంత్ భార్య అన్విత వచ్చేసింది అని అనుకున్నారంతా, కానీ 'బిబి టీవి' లో వీడియో కాల్ మాట్లాడింది అంతే.

"మన వాళ్ళకి ఎవరికి వీలు అవ్వట్లేదు. అందుకే నన్ను వీడియో కాల్ కి పిలిచారు. ఊరికే ఏడ్వద్దు. బాగా ఆడండి. కీర్తి గారు మీరు బాధపడొద్దు. మేము అంతా ఉన్నాం" అని అంది అన్విత. ఆ తర్వాత రేవంత్ మాట్లాడాడు. అన్విత మాట్లాడుతూ "ఏం బాధపడొద్దు. మంచిగా ఆడి, టైటిల్ గెలుచుకొని రండి" అని అనగా, అందరి గురించి చెప్పమని రేవంత్ అనేసరికి టీవీ ఆఫ్ అయిపోయింది. అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. "బిగ్ బాస్ ప్లీజ్.. ఒక్కసారి ఆన్ చేయండి" అని హౌస్ మేట్స్ రిక్వెస్ట్ చేసారు. "ప్లీజ్ బిగ్ బాస్ ఒక్కసారి టీవీ ఆన్ చేయండి" అని రేవంత్ కన్నీళ్ళు పెట్టుకున్నాడు. అయినా కూడా బిగ్ బాస్ స్పందించలేదు.

ఆ తర్వాత రేవంత్ వాళ్ళ అమ్మ వచ్చింది. హౌస్ లో వాళ్ళ అమ్మని చూసేసరికి రేవంత్ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యాడు. ఆ తర్వాత ఇద్దరు కాసేపు మాట్లాడుకున్నారు. "కోపం తగ్గించు. జనరల్ గా కోపం లేదు. నా కోపమే వచ్చింది" అని అమ్మ అన్నారు. ఆ తర్వాత కీర్తిని దగ్గరకు రమ్మని పిలిచి, "నువ్వు, నా కూతురు లాంటిదానివి.. కాదు నా కూతురువే. ఎప్పుడు అయినా సరే నువ్వు మా ఇంటికి రావొచ్చు" అని అమ్మ చెప్పగానే, "అలాగే అమ్మ"అని కీర్తి కన్నీళ్ళు పెట్టుకుంది. ఆ తర్వాత రేవంత్ వాళ్ళ అమ్మని టైం అయిందని బిగ్ బాస్ బయటికి పంపించేసాడు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.