English | Telugu
పల్లవి ప్రశాంత్ ని రతికరోజ్ మిస్ అవుతుందంట!
Updated : Oct 5, 2023
బిగ్ బాస్ సీజన్-7 లో కొత్త కంటెస్టెంట్స్, కొత్త టాస్క్ లతో క్రేజ్ సంపాదించుకుంటుంది. అయితే హౌజ్ లోకి మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు. అందులో నాలుగు వారాల్లో కిరణ్ రాథోడ్, షకీల, దామిణి, రతికరోజ్ ఎలిమినేట్ అయ్యారు. అయితే వీళ్ళ నలుగురిలో అత్యధిక క్రేజ్ సంపాదించుకుంది మాత్రం రతికరోజ్.
రతికరోజ్ బిగ్ బాస్ హౌజ్ లోకి టైటిల్ ఫేవరెట్ గా ఎంట్రీ ఇచ్చింది. అయితే తను పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్ లతో కలిసి ప్రేక్షకులకు 'బేబీ' సిమిమాని చూపించిన విషయం తెలిసిందే. అయితే రతిక కంటెంట్ కోసం మాట్లాడే విధానం, తన మాటలని తనే ఫ్లిప్ చేయడం, అక్కడివి ఇక్కడ, ఇక్కడవి అక్కడ చెప్పడంతో తనని రతిక బదులు రాధిక అని నెటిజన్లు ట్రోల్స్ చేసిన విషయం తెలిసిందే.
అయితే ఇక ఈ వారం రతిక బయటకొచ్చేస్తుందని అనగా సీరియల్ బ్యాచ్ తో కలిసిపోయింది. ఎలిమినేట్ అయి బయటకొచ్చేముందు కూడా శివాజీ, పల్లవి ప్రశాంత్ లతో అసలు మాట్లాడలేదు, అసలు చూడను కూడా చూడలేదు రతిక. దాంతో సీరియల్ బ్యాచ్ ఇంపాక్ట్ రతిక మీద ఏ రెంజ్ లో ఉందో అర్థమవుతుంది. ఇక హౌజ్ లో తన గ్లామర్ కి ఫ్యాన్స్ కూడా ఆ రేంజ్ లోనే ఉన్నారు.
బిగ్ బాస్ నుండి బయటకొచ్చాక రతిక బిగ్ బాస్ లైవ్ చూస్తుంది. అయితే హౌజ్ లో రతిక గురించి శివాజీ, పల్లవి ప్రశాంత్ ఇద్దరు మాట్లాడుకున్న మాటలని పోస్ట్ చేసి, దానికి ఐ మిస్ యూ బోత్ ఆఫ్ యూ అని టైటిల్ కూడా పెట్టేసింది. " అన్న నీకు రతిక గుర్తుకు వస్తుందా? నాకు రాత్రంతా తెగ గుర్తుకు వచ్చింది అన్న, నిద్ర కూడా పట్టలేదని పల్లవి ప్రశాంత్ అనగా.. నాకు గుర్తుకు వచ్చింది కానీ ఏం చేస్తాం, చిన్న పిల్లరా అని శివాజీ అన్నాడు.
అది చిన్న పిల్లేంటి అన్న, బర్రె పిల్ల, మస్త్ కోపం వస్తుంది అన్న అని ప్రశాంత్ అన్నాడు. బయటకు వెళ్ళాక కలుద్దాం లేరా, నువ్వు భాదపడకు, నాకు అర్థమైంది నీ బాధ అని శివాజీ అనగానే.. నా మీద ఎందుకు అన్న అంత కోపం, నన్ను నామినేట్ చేసిన కూడా మన పిల్లే కదా అని నేను మాట్లాడినానని పల్లవి ప్రశాంత్ అంటాడు. ఈ మాటలన్నీ తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన రతికరోజ్.. " దట్ ఈజ్ సో స్వీట్.. నేను కూడా మీ ఇద్దరిని మిస్ అవుతున్నాను" అని పోస్ట్ చేసింది.