English | Telugu

ఛంఢాలం, బఫూన్స్ అని తిట్టిన రతిక.. ఆట సందీప్ మిస్టర్ పర్ ఫెక్ట్!

బిగ్ బాస్ సీజన్ 7 ఆసక్తికరంగా షురూ అయింది. సోమవారం నామినేషన్ , ఎలిమినేషన్ అంటూ హౌజ్ లో హీటెక్కే వాదనలు‌ ఉండగా, మంగళ, బుధ, గురు, శుక్ర వారాల్లో టాస్క్ లు, గేమ్ లు ఉంటాయి. ఒక్కో గేమ్ ని ఆడుతూ గెలుపు కోసం ప్రయత్నించే కంటెస్టెంట్స్ కి ప్రతీ గేమ్ కీలకమే.. దాంతో ప్రతీ టాస్క్ రసవత్తరంగా కోనసాగుతుంది. ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ దొరికేది శని, ఆది, సోమవారాలు మాత్రమే అనడంలో ఆశ్చర్యం లేదు.

ఈ సీజన్ ని చూస్తుంటే బిగ్ బాస్ సీజన్-4 గుర్తొస్తుంది. గేమ్స్ లో ప్రాణాలతో బయటకొస్తారా అన్నట్టుగా ఆడేవాళ్ళు. ఇప్పుడు అలాగే సాగుతుంది. ఒక్కో దశలో ఒక్కో గేమ్ కీలకం .‌కాగా గత రెండు మూడు రోజుల నుండి సాగుతున్న రణధీర, మహాబలి మధ్యలో జరిగిన పోటీ ముగిసింది అయితే వారిలో రణధీర టీమ్ గెలిచింది. బిగ్ బాస్ రణధీర టీమ్ లో ఒకరికి ఎవిక్షమ్ పాస్ వస్తుంది. అది ఎవరో డిసైడ్ చేసే అవకాశం మహాబలి టీమ్ కి ఇచ్చాడు బిగ్ బాస్. రతికరోజ్, పల్లవి ప్రశాంత్, దామిణి, గౌతమ్ కృష్ణ, టేస్టీ తేజ మహాబలి టీమ్ లో ఉండగా.. పల్లవి ప్రశాంత్, దామిణి తమ 'కీ' రణధీర టీమ్ లోని వాళ్ళకి ఇచ్చేశారు. కాగా రతిక నేను చివరన వెళ్తానని స్టార్ట్ చేసింది.

అయితే దామిణికి, రతికకి మధ్య గొడవ జరిగింది. నువ్వు గేమ్ లో ఏం ఇన్ పుట్స్ ఇచ్చావంటూ రతికని దామిణి అడుగగా.. అసలెవరు ఈ టీమ్ కి లీడర్ అంటూ క్వశ్చన్ అడుగగా.. నేనేనని దామిణి అంది. కాసేపటికి బయటకొచ్చిన తర్వాత నేనే లీడర్ అంటూ గౌతమ్ కృష్ణ అంటాడు. తనవల్ల ఎంతమంది బాధపడ్డా, తను మాత్రం వాళ్ళందరి కోసం కొంచెం కూడా సాక్రిఫైజ్ చేసుకోవట్లేదంటూ గౌతమ్ కృష్ణ ఫైర్ అవుతాడు. నేను కూల్ గా మాట్లాడుతున్నానంటూ రతిక అంటుంది. ఇక మీ టీమ్ అంతా ఆలోచించి తొందరగా కీ డెసిషన్ చెప్పండి అంటూ సంచాలక్ గా చేస్తున్న ఆట సందీప్ అడుగగా.. ఛీ ఏం టీమ్ అసలు ఇది, ఛండాలం‌‌.. అందరూ భఫూన్స్ అని రతిక అంటుంది. అది విన్న శుభశ్రీ ఫీల్ అవుతుంది. మమ్మల్ని అలా ఏలా అంటావంటూ శుభశ్రీ బాధపడుతుంది. ఆ తర్వాత.. "రెండు రోజుల నుండి మహాబలి టీమ్ లో ఉన్నావ్. వాళ్ళని బఫున్స్ అని ఎలా అంటవ్" అంటూ రతికని సంచాలక్ గా చేస్తున్న ఆట సందీప్ అంటాడు. అవును నాకు అలాగే అనిపించిందని రతిక అంటుంది. ఈ టీమ్ లో ఉండాలని లేదని రతిక అనగా‌‌.. అయితే వాళ్ల టీమ్ లోకి వెళ్ళమని దామిణి అంటుంది. కాసేపటికి ఇద్దరికి గొడవ జరుగుతుంది. అయితే రతిక చివరి వరకు కంటెంట్ కోసమే చేస్తుందని బిగ్ బాస్ చూసే ప్రేక్షకులకు తెలుస్తుంది. అప్పటికీ షకీల.. కంటెంట్ కోసం ఇంత టైమ్ వేయిట్ చేపించడం అవసరామా అంటూ రతికని అంటుంది. ఇక మరొకవైపు శివాజీ.. ఈ టెన్షన్ ను నేను భరించలేను డోర్స్ ఓపెన్ చేయండి మేం వెళ్లిపోతామంటూ తన నిరసన వ్యక్తం చేస్తాడు శివాజీ.