English | Telugu
రతిక మైండ్ గేమ్.. బూతులతో రెచ్చిపోయిన అమర్ దీప్!
Updated : Sep 15, 2023
బిగ్ బాస్ సీజన్-7 అతి తక్కువ మందితో స్టార్ట్ చేసి అల్టిమేట్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. ప్రతీ సీజన్ లో 21 మందికి పైగా కంటెస్టెంట్స్ తో గేమ్స్, టాస్క్ అంటూ బిజీ చేసిన రాని కిక్కు.. ఇప్పుడు పదమూడు మంది కంటెస్టెంట్స్ తోనే వస్తుంది. తాజాగా టీవీ షోలలో బిగ్ బాస్ సీజన్-7 కి అత్యధిక టీఆర్పీ రేటింగ్ వస్తుంది. దీనికి కారణాలు బోలేడున్నాయి. మొదటిది రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్, రెండవది ఇంటికి పెద్ద తిక్కు యాక్టర్ శివాజీ. ఇక మిగిలిన సీరియల్ యాక్టర్స్ అమర్ దీప్, శోభా శెట్టి, ప్రియాంక జైన్... ఉన్నారా లేరా అన్నట్టుగా ఉంటున్నారు.
రతిక తన మైండ్ గేమ్ తో హౌజ్ మేట్స్ కి మెంటల్ ఎక్కిస్తుంది. నిన్నటి వరకు జరిగిన రణధీర, మహాబలి టీమ్ ల పోటీలో రణధీర టీమ్ గెలిచి ఒక్కొక్కరు ఒక్కో పవరస్త్రలోని భాగాన్ని పొందారు. కాగా గురువారం నాటి ఎపిసోడ్‌లో ఓడిపోయిన మహాబలి టీమ్ లోని కంటెస్టెంట్స్ కి గెలిచిన వారిలో నుండి విజేతను ఎన్నుకునే అవకాశాన్ని కలిగించాడు బిగ్ బాస్. కాగా పల్లవి ప్రశాంత్ వెళ్ళి అమర్ దీప్ దగ్గరున్న 'కీ' ని తీసుకొని శివాజీకి ఇచ్చాడు. ఇక కాసేపటికి దామిణి వెళ్లి షకీలకి 'కీ' ఇచ్చింది. అయితే మిగిలిన ముగ్గురిలో అందరూ చివరి స్థానంలో వెళ్తానని అన్నారు. టేస్టీ తేజ, గౌతమ్ కృష్ణ, రతిక ఉండగా.. రతిక చివరగా వెళ్తానని వాదనకి దిగింది. ఇదేం గ్రూప్ అసలు నా నిర్ణయానికి వాల్యూ లేదా అంటూ రతిక అనగా.. గౌతమ్ కృష్ణ వివరణ ఇస్తున్నాడు. అయిన సరే మహాబలి గ్రూప్ అంతా కలిసి తర్వాత వెళ్ళాళ్సింది రతిక అన్నా సరే తను వెళ్ళకుండా అలాగే టైమ్ చేసింది. ఇక సంచాలక్ గా చేస్తున్న ఆట సందీప్ ఓపికకి పరీక్ష పెట్టింది రతిక.
ఇక రతిక చూపించే అటిట్యూడ్ కి మహాబలి టీమ్ తో పాటు రణధీర టీమ్ లోని కంటెస్టెంట్స్ కి కూడా చిరాకేసింది. ఇక ఆట సందీప్ కి ఓపిక నశించి. అసలేంటి నువ్వు నీ దగ్గర ఉన్న కీ తెచ్చి ఎవరికో ఒకరికి ఇవ్వమని అడుగగా.. ఇంకా డిసైడ కాలేదని అన్నాక బిగ్ బాస్ వాయిస్ వస్తుంది. మహాబలి టీమ్ కి ఇచ్చిన సమయాన్ని సరిగ్గా వాడుకోలేకపోయారు కాబట్టి ఇక పవరస్త్రని దక్కించుకునే అవకాశం రణధీర టీమ్ చేతులలోకి వెళ్ళిందని బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో అన్నాడు. అయితే ఇక ఎవరి దగ్గర పవరస్త్రలోని భాగం లేదో వారికి ఎవరు మరొక 'కీ' ని ఇవ్వకూడదని ఉన్నవాళ్ళ దగ్గర నుండి తీసుకొని కీ ఉన్నవాళ్ళకే ఇవ్వాలని బిగ్ బాస్ చెప్పగా.. ప్రియాంక జైన్, శోభాశెట్టి, అమర్ దీప్ లు పోటీ నుండి తప్పుకోవాల్సి వచ్చింది. ఇక అమర్ దీప్ రతికని ఉద్దేశించి పచ్చి బూతులు తిడుతూ తన ఫ్రస్టేషన్ ని చూపించాడు. అయితే అమర్ దీప్ మాట్లాడిన బూతు మాటలు సెన్సార్ కట్ వేశారు. అప్పటికే హౌజ్ లోని వాళ్లంతా తనని కూల్ చేసే ప్రయత్నం చేసిన అతను ఊరుకోలేదు. రెచ్చిపోయి మరీ రతికని తిట్టాడు. గేమ్ ఆడేవాళ్ళకి అవకాశం లేకుండా చేసిందంటూ రతికపై అమర్ దీప్ రెచ్చిపోయాడు.