English | Telugu

చిరంజీవితో రష్మీ... పరువు తీసిన భాస్కర్

జబర్దస్త్ లో రష్మీ మీద జోక్ వేసాడు బులెట్ భాస్కర్. దాంతో రష్మీ తలతిప్పేసుకుంది. బులెట్ భాస్కర్ స్టేజి మీదకు తన స్కిట్ పార్టనర్ తో వచ్చేసరికి రష్మీ ముందు డైలాగ్ వేసింది "కొన్ని ఎపిసోడ్స్ గా ఒకటి మిస్ అవుతోంది..అది మంచం..మంచం తిరిగొచ్చింది" అనేసరికి "నువ్వు ఈమధ్య ఒక సినిమా చేసావ్ కదా" అని భాస్కర్ కామెడీగా అడిగేసరికి " ఎవరి సినిమా చేసాను చెప్పండి" అని రష్మీ అడిగింది. "చిరంజీవి గారి సినిమాలో నువ్వు చేసావ్.. నీకోసం సినిమా థియేటర్ కి వెళ్తే ఇంటర్వెల్ వరకు కనిపించలేదు..సరే ఇంటర్వెల్ తర్వాత వస్తావ్ కదా అని థియేటర్ లో వెయిట్ చేశా ఇంతలో కింద కర్చీఫ్ పడిపోయింది. తీసుకుందామని వంగి కర్చీఫ్ తీసుకుని లేచేసరికి నువ్వు వెళ్లిపోయావ్" అని బులెట్ భాస్కర్ సెటైర్ వేసాడు. దాంతో రష్మీ మూతి తిప్పేసుకుంది.

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘భోళా శంకర్’ మూవీలో చాలామంది బుల్లితెర నటులు కనిపించారు. ఈ మూవీలో మొత్తం బిగ్ బాస్ కంటెస్టెంట్లు, జబర్దస్త్ ఆర్టిస్టులే కనిపించారు. అలా ఈ సినిమాలో యాంకర్‌ కమ్‌ యాక్టర్‌ రష్మి గౌతమ్‌ కూడా కనిపించింది. ఓ సీన్‌ కి రిలేటెడ్ వచ్చే ఓ పాటలో చిరంజీవితో కలిసి స్టెప్పులేసింది. ఈ విషయం మీద రీసెంట్ జబర్దస్త్‌ ఎపిసోడ్‌లో రష్మి మీద భాస్కర్‌ పంచ్‌ వేశాడు. తర్వాత భాస్కర్ మీద పంచ్ వేసిన భాస్కర్ స్కిట్ పార్టనర్ .."మీరు పెళ్ళికి ముందు ఎవరినో ప్రేమించారు కదా" అని అడిగేసరికి "లేదు జడ్జెస్ మీద ఒట్టు" అని భాస్కర్ చెప్పేసరికి డైరెక్ట్ గా పెళ్లే అని కౌంటర్ వేసింది రష్మీ.