English | Telugu
Brahmamudi: తన భర్తని కాపాడమని ఇంట్లోని వాళ్ళని వేడుకున్న భార్య!
Updated : Nov 8, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -248 లో.. కావ్యని రాజ్ భార్య గా ఒప్పుకొని ఇద్దరు హ్యాపీగా ఉండండని సితారామయ్య చెప్తాడు. కానీ రాజ్ మౌనంగా ఉంటాడు. ఈ ఇంట్లో అందరు మీకు నచ్చినట్టుగా ఉండేలా చూసుకొనే బాధ్యత నాది. మీరు వచ్చి రెస్ట్ తీసుకోండంటు సీతారామయ్యని ఇందిరాదేవీ గదిలోకి తీసుకొని వెళ్తుంది.
మరొకవైపు తన కూతుళ్ల విషయంలో పెద్దయన ఏం నిర్ణయం తీసుకున్నాడోనని కనకం టెన్షన్ పడుతుంది. కావ్యని ఎవరైనా ఏమైనా అంటే తట్టుకోలేక ఇంట్లో నుండి వెళ్ళిపోతుందని కనకం అనగానే.. నిజమే నువ్వు ఒకసారి కావ్యకి ఫోన్ చేసి విషయం కనుకోమ్మని కృష్ణమూర్తి అంటాడు కనకం కావ్యకీ ఫోన్ చేస్తుంది. మమ్మల్ని కోడళ్లుగా ఇక్కడే ఉండమని తాతయ్య చెప్పారు కానీ తాతయ్యకి క్యాన్సర్ అని కావ్య బాధపడుతు చెప్పగానే.. కనకం కృష్ణమూర్తి ఇద్దరు షాక్ అవుతారు.. ఆ తర్వాత ఇద్దరు సీతారామయ్యని చూసి రావాలని దుగ్గిరాల ఇంటికి బయలుదేర్తారు.
మరొక వైపు కళ్యాణ్ కి అనామిక ఫోన్ చేసి ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందామని అడుగుతుంది. ఇప్పుడు కాదంటూ సీతారామయ్య గురించి చెప్పి బాధపడుతాడు. అనామిక అర్థం చేసుకొని తాతయ్య జాగ్రత్త అని చెప్తుంది. మరొకవైపు ఇంట్లో గొడవలు జరుగకుండా నువ్వే చూసుకోవాలని అపర్ణకు సుభాష్ చెప్తాడు. అప్పుడే కనకం, కృష్ణమూర్తి ఇద్దరు రావడం చూసి వాళ్లని అపర్ణ అవమానిస్తుంది. వాళ్లు వెనక్కి తిరిగి వెళ్తుంటే సుభాష్ ఆపి.. నాన్నగారు గదిలో ఉన్నారని చెప్పి వాళ్ళని లోపలికి పంపిస్తాడు. మరొకవైపు అపర్ణ అన్న మాటలు కావ్య వింటుంది. ఎందుకు వచ్చారు నాన్న అంటూ బాధపడుతుంది. ఆ తర్వాత కృష్ణమూర్తి, కనకం ఇద్దరు సీతారామయ్య దగ్గరికి వెళ్తారు.. మీ కూతుళ్లు ఎప్పుడు ఇక్కడే ఉంటారని సీతారామయ్య అనగానే.. ఇంత మంచి మనసున్న మీకేం కాదంటు కనకం, కృష్ణమూర్తి కాసేపు మాట్లాడి వెళ్ళిపోతారు.
మరొక వైపు స్వప్న చేసిన మోసాన్ని గుర్తుకు చేస్తు స్వప్న తో రాహుల్ గొడవపడుతుంటే రుద్రాణి వచ్చి.. ఇంట్లో ఇలా గొడవలు పడితే మనల్ని ఇంట్లో నుండి గెంటేస్తారని చెప్తుంది. మరొక వైపు కావ్య గదిలోకి రాగానే రాజ్ వెళ్లిపోతు ఉంటాడు. కావ్య ఆగమని చెప్పగానే.. కావ్య బాధపడేలా రాజ్ మాట్లాడి వెళ్ళిపోతాడు. తరువాయి భాగంలో తన భర్త ని కాపాడుకోవాలని ఇంట్లో ఉన్న ఆస్తి పేపర్స్ తీసుకొని వచ్చి నేను సుమంగళి గానే పోవాలి. నా భర్త ప్రాణాన్ని కాపాడండి. ఏ దేశంలో నా భర్తని కాపాడే డాక్టర్ లు ఉంటారో అక్కడకి తీసుకొని వెళ్లి కాపాడండి. ఎంత ఖర్చు అయిన పర్వాలేదంటూ ఇందిరాదేవి ఏడుస్తుంది. ఎంత డబ్బులు ఖర్చు చేసిన ఆస్తి తరుగుతుంది కానీ ప్రయోజనం ఏముందని రుద్రాణి అంటుంది. రుద్రాణి అన్న మాటకీ రాజ్ ఎలా స్పందిస్తాడో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే?