English | Telugu

BiggBoss 7:కన్నయ్య.. నేను కూడా అమ్మనే.. పెళ్ళెప్పుడు చేసుకుందాం శివ్?


బిగ్ బాస్ సీజన్-7 లో ఫ్యామిలీ వీక్ కొనసాగుతుంది. నిన్న శివాజీ వాళ్ళ కొడుకు వెంకట్ రావడంతో మోస్ట్ ఎమోషనల్ గా సాగింది ఎపిసోడ్.. ఆ తర్వాత అంబటి అర్జున్ భార్య సురేఖ రావడం, తనకి శ్రీమంతం చేయడం అదంతా ఆకట్టుకోగా, కాసేపటికి అశ్వినిశ్రీ వాళ్ళ అమ్మ వచ్చి బోరున ఏడిపించేసింది. ఇక ఈ రోజు రిలీజైన రెండు ప్రోమోలు మరింత ఎమోషనల్ గా ఉన్నాయి.

మొదటి ప్రోమోలో కన్నయ్య... అంటూ అమ్మ పిలుపు విని హౌస్ లోని వాళ్ళంతా ఆశ్చర్యకరంగా గేట్ వైపు చూశారు. ఎవరు రాకపోవడంతో హౌస్ మేట్స్ అంతటా వెతికారు. ఇక కన్నయ్య పంచె వచ్చిందా అని వినపడగానే గౌతమ్ ఎమోషనల్ అయ్యాడు. కాసేపటికి మెయిన్ గేట్ నుండి గౌతమ్ వాళ్ళ అమ్మ వచ్చింది. వచ్చీ రాగానే గౌతమ్ ని హత్తుకొని ఏడ్చేసింది. ఇక ఆ తర్వాత హౌస్ మేట్స్ తో.. గౌతమ్ కి బయట అమ్మాయిల ఫాలోయింగ్ పెరిగిందంటూ చెప్పుకొచ్చింది. కాసేపటికి యావర్ కి వాళ్ళ అమ్మ గుర్తొచ్చిందంటూ ఎమోషనల్ అవ్వగా.. నేను కూడా నీకు అమ్మనే, బయటకు వచ్చాకా మా ఇంటికి రా యావర్ అంటు గౌతమ్ వాళ్ల అమ్మ అంది. ఇక హౌస్ మేట్స్ అందరికి గోరుముద్దలు తినిపించగా ప్రతీ ఒక్కరి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఆట బాగా ఆడుతున్నావ్. ఇలాగే ఉండు. నీలాగే ఉండు అంటు గౌతమ్ కి వాళ్ళ అమ్మ కొన్ని విషయాలని షేర్ చేసింది.

ఇక రెండో ప్రోమోలో.. ప్రియాంక బాయ్ ఫ్రెండ్ శివ్ వచ్చాడు. వచ్చీ రాగానే ఎర్రగులాబీతో ప్రపోజ్ చేశాడు. హౌస్ మేట్స్ అంతా అలానే చూస్తు ఉండిపోయారు. కాసేపటికి పెళ్ళెప్పుడు అని శివ్ ని ప్రియాంక అడుగగా.. నువ్వు ఎప్పుడు బయటకు వస్తే అప్పుడే చేసుకుందామని శివ్ అన్నాడు. కాసేపటికి శోభాశెట్టి వచ్చి శివ్-ప్రియంకలతో మాట్లాడింది. ఇక వెళ్ళాల్సిన సమయం ఆసన్నమైందని బిగ్ బాస్ అనగానే ప్రియాంకకి ముద్దుచ్చి బయటకొచ్చేశాడు. ఇద్దరు కాసేపు ఎమోషనల్ అయ్యారు. అయితే హౌస్ లో ఈ రోజు కూడా గుండెల్ని పిండేసే ఎపిసోడ్ రెడీ అయిందని ఈ ప్రోమో చూస్తుంటే తెలుస్తుంది.



Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.