English | Telugu

Guppedantha Manasu : గతం మొత్తం చెప్పిన రిషి.. ఏంజిల్ నమ్మలేదుగా!

స్టార్ మా టీవీలో ప్రసరమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -915 లో.. ఏంజిల్ ఇంటికి వచ్చి వసుధార, రిషిల గురించి అలోచిస్తుంది. దేని గురించి ఆలోచిస్తున్నావ్? రిషి నీతో పెళ్లి వద్దని చెప్పి వసుధారని పెళ్లి చేసుకున్నాడని బాధపడుతున్నావా అని విశ్వనాథ్ అనగానే.. రిషి పెళ్లికి కనీసం నన్ను పిలవలేదు. నాతో అంత క్లోజ్ గా ఉండే వసుధార కూడా ఒక్కమాట కూడా చెప్పలేదని ఏంజిల్ కోపంగా ఉంటుంది.

మరొక వైపు వసుధార, రిషి ఇద్దరు కాలేజీలో ఏంజిల్ మాట్లాడిన తీరు గుర్తుకు చేసుకుంటారు. అసలు ఏంజిల్ తో ముందే అంత చెప్పి ఉంటే బాగుండు. ఇప్పుడు ఏంజిల్ ని ఫేస్ చెయ్యలేకపోతున్న అని రిషి అంటాడు. ఆ తర్వాత ఇద్దరు విశ్వనాథ్ దగ్గరికి వెళ్తారు. మరొక వైపు ఫణింద్ర, శైలేంద్ర, దేవాయని ముగ్గురు కలిసి మహేంద్ర దగ్గరికి వెళ్తారు. రిషి ఎక్కడ అని మహేంద్రని శైలేంద్ర అడుగుతాడు. బయటకు వెళ్ళాడని మహేంద్ర చెప్తాడు. అయిన మళ్ళీ మళ్ళీ శైలేంద్ర అడుగుతూనే ఉంటాడు. దాంతో ఫణీంద్ర కోపంగా.. ఆపుతావా అంటూ శైలేంద్రని అంటాడు. నేను నీ విషయంలో తప్పుగా మాట్లాడానని మహేంద్రతో దేవయాని అంటుంది. మీరు భోజనం చేసి వెళ్ళండి అన్నయ్య అని మహేంద్ర అనగానే.. కుదరదని దేవయాని అంటుంది. పిలిచింది నన్ను, మిమ్మల్ని కాదు మీకు ఇష్టం లేకపోతే వెళ్లిపోండని ఫణింద్ర వాళ్ళకి కౌంటర్ వేస్తాడు. ఆ తర్వాత శైలేంద్ర కలుగజేసుకొని అందరం కలిసే భోజనం చేద్దామని అంటాడు.

మరొక వైపు రిషి వసుధార ఇద్దరు విశ్వనాథ్ ఇంటికి వెళ్తారు. ఏంజిల్ ని పెళ్లి చేసుకోమని చెప్తే పెళ్లి అయిందని చెప్పావ్? మరి వసుధారని ఎలా పెళ్లి చేసుకున్నావని రిషిని విశ్వనాథ్ అడుగుతాడు. ఎందుకంటే పదిహేను రోజుల్లో నీ భార్యని చూపించకపోతే నన్ను పెళ్లి చేసుకోవాలని చెప్పాను కాదా నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక ఇలా వసుధారని పెళ్లి చేసుకున్నాడని ఏంజిల్ కోపంగా మాట్లాడుతుంది. అది కాదు ఏంజిల్ అంటూ రిషి తన తల్లి కోసం పెళ్లి చేసుకున్నానని జగతి, మహేంద్ర ఇద్దరు తన తల్లితండ్రులని తనకి ఇది వరకే వసుధారతో ఎంగేజ్ మెంట్ అయిందని ఏంజిల్, విశ్వనాథ్ కి రిషి చెప్తాడు. కానీ ఏంజిల్ మాత్రం.. కథ బాగా అల్లావ్. ఇప్పటికి ఇప్పుడు ఎలా ఇంత బాగా అల్లావని అనగానే రిషి షాక్ అవుతాడు. మరి రిషి చెప్పిన నిజాన్ని ఏంజిల్ నమ్ముతుందా లేదా తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.