English | Telugu
కనకం డ్రామా హిట్టు.. షాక్ లో రాహుల్, రుద్రాణి!
Updated : Oct 1, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -215 లో.. కావ్య, రాజ్ ఇద్దరు కలిసి కనకం షేర్ చేసిన లొకేషన్ కి వెళ్తుంటారు. మరొకవైపు హాస్పిటల్ లో ఉన్న రాహుల్ యాక్టింగ్ స్టార్ట్ చేస్తాడు. నా స్వప్న లేనప్పుడు నాకు ఈ ఇంజక్షన్ ట్రీట్మెంట్ వద్దు అంటూ చిన్నపిల్లాడిలాగా మారాం చేస్తూ ఉంటాడు. అలా రాహుల్ చేయడం చూసిన రుద్రాణి.. వీడేంటి నాకన్నా బాగా యాక్ట్ చేస్తున్నాడని అనుకుంటుంది.
ఆ తర్వాత రాహుల్ ని డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్ చెప్తాడు. మరొక వైపు కావ్య, రాజ్ ఇద్దరు రావడం లేదు ఇంక ఎంత సేపు ఇలా మేనేజ్ చేయాలని కనకం అనుకుంటుంది. నీకు దోషం ఉంది అది పోవాలంటే, ముందు నువ్వు ఒక ముదిరిన బెండకాయని పెళ్లి చేసుకోవాలని కనకం చెప్పగానే.. మైఖేల్ ఆశ్చర్యంగా చూస్తాడు. ఆ తర్వాత కనకం తిట్టే తిట్లు భరించలేక ముదిరిన బెండకాయని మైఖేల్ తెప్పిస్తాడు.. ఆ తర్వాత తనకు వచ్చి రాని మంత్రాలు చదువుతు బెండకాయకి మఖేల్ చేత తాళి కట్టిస్తుంది. ఇక కావ్య రాజ్ ఇద్దరు రావడం లేదని కనకం ఎదరుచూస్తుండగా.. అక్కడికి కావ్య, రాజ్ వస్తారు. ఆ తర్వాత మైఖేల్ బెండకాయకి కట్టిన తాళి తీసి స్వప్నకి కట్టబోతుంటే కనకం ఆపి నా అల్లుడు కూతురు వచ్చాడంటు కావ్య రాజ్ లని చూపిస్తుంది. కాసేపటికి నిన్ను అప్పుడు వదిలి పెట్టి తప్పు చేసానని మైఖేల్ తో రాజ్ అంటాడు. నేను ఎవరికీ తెలియకుండా ప్లాన్ చేస్తే మీకెలా తెలిసిందని మైఖేల్ అనగానే.. కనకం తన వేషం గురించి తన నటన గురించి చెప్తుంది. మైఖేల్ షాక్ అవుతాడు.. ఆ తర్వాత మైఖేల్ ని పోలీస్ లు వచ్చి తీసుకెళ్తారు. కావ్య, రాజ్ కనకం అందరు కలిసి స్వప్నని తీసుకొని ఇంటికి బయల్దేరి వస్తారు.
మరొక వైపు రాహుల్ తన నటనతో అందరిని నమ్మించాలని అనుకొని నా స్వప్న లేకుండా నేను ఎలా ఉండాలంటూ ఓవర్ యాక్షన్ చేస్తుంటాడు. అప్పుడే కావ్య రాజ్ లు స్వప్నని తీసుకొని వస్తారు. తనని చూసిన రాహుల్, రుద్రాణి ఒక్కసారిగా షాక్ అవుతారు. ఆ తర్వాత రాజ్ ఇంట్లో వాళ్ళకి జరిగింది అంత చెప్తాడు. పోలీసులకి మైఖేల్ నీ పట్టించామని అనగానే రాహుల్, రుద్రాణి ఇద్దరు టెన్షన్ పడుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
