English | Telugu
జైలుకి వెళ్ళిన టేస్టీ తేజ.. రతిక నీకు సిగ్గుందా?
Updated : Oct 1, 2023
బిగ్ బాస్ హౌజ్ లో శనివారం జరిగిన ఎపిసోడ్ హైలైట్ గా నిలిచింది. సీరియల్ బ్యాచ్ బెండ్ తీసాడు నాగార్జున. ఆట సందీప్ సంచాలక్ గా కంప్లీట్ ఫెయిల్ అయ్యావని అన్నాడు.
ఆ రోజు జరిగిన స్మైలీ టాస్క్ లో గౌతమ్ కృష్ణని టేస్టీ తేజ మెడ మీద బెల్ట్ తో లాగగా, అది వైల్డ్ గా అనిపించింది. దానిని టీవీలో వేసి కంటెస్టెంట్స్ అందరికి చూపించాడు నాగార్జున. శోభాశెట్టి, ప్రియాంక జైన్, శుభశ్రీ వాళ్ళంతా వద్దని చెప్తున్నా ఎందుకలా చేశావని టేస్టీ తేజని నాగార్జున అడుగగా.. ఎంకరేజ్ చేస్తున్నారేమో అని అనుకున్నానని టేస్టీ తేజ అన్నాడు. ఆ తర్వాత ఇక కొట్టడం అనవసరం అని ఆపేశానని టేస్టీ తేజ అనగా.. అనవసరం అని కాదు, గౌతమ్ ఆ లైన్ బయటకు వచ్చాడని నువ్వు ఆపేశావని నాగార్జున అన్నాడు. ఇక తప్పైందని, మీరు ఏ శిక్ష వేసిన ఓకే అని టేస్టీ తేజ అనగా.. ఏం చేద్దామని కంటెస్టెంట్స్ ని అడుగుతాడు నాగార్జున. జైలుకి పంపించాలని కంటెస్టెంట్స్ చెప్పగా.. టేస్టీ తేజని జైలుకి పంపించాడు నాగార్జున. బిగ్ బాస్ సీజన్-7 లో టేస్టీ తేజ జైలుకి వెళ్ళిన మొదటి కంటెస్టెంట్. ఇక తర్వాతి వారం ఎవరు తనని నామినేట్ చేయకూడదని, డైరెక్ట్ నామినేషన్లో ఉంటావని టేస్టీ తేజతో నాగార్జున అన్నాడు. ఇక గౌతమ్ కృష్ణని హింసించినందుకు గాను జైలులో ఉండి అతడేం చెప్పిన చేయాలని నాగార్జున అన్నాడు.
ఇక రతిక, అమర్ దీప్ ల బెండ్ తీసాడు నాగార్జున. మొన్నటి పట్డు వదలకురా టాస్క్ లో ప్రిన్స్ యావర్, శుభశ్రీ, ప్రశాంత్ ఉండగా.. ప్రశాంత్ ని వాళ్ళిద్దరు డిస్టబ్ చేయడానికి అతి చేశారని నాగార్జున అన్నాడు. మీ అమ్మ అయ్య ఇలానే పెంచారా? సిగ్గు ఉందా? అంటూ ప్రశాంత్ ని అనడం కరెక్టేనా అని రతికతో నాగార్జున అన్నాడు. రతిక నీకు సిగ్గుందా అని అంటే నువ్వు తీసుకుంటావా అని నాగార్జున అనగా ఆమె ఏడుపు ఒక్కటే తక్కువైంది. అమర్ దీప్ మాట్లాడిన విధానం సరిగా లేదని, అలా పర్సనల్ గా వెళ్ళకూడదని నాగార్జున అనగా సారీ సర్, ఇంకోసారి ఇలా చేయనని అమర్ దీప్ అన్నాడు. ఆ తర్వాత శుభశ్రీని గౌతమ్ కృష్ణ కామెంట్ చేసింది చూపించాడు నాగార్జున. హీట్ ఆఫ్ ది మూమెంట్ లో అలా వచ్చిందని నాగార్జునతో గౌతమ్ కృష్ణ అన్నాడు.