English | Telugu
ప్రభాస్, నేను మంచి ఫ్రెండ్స్!
Updated : Aug 20, 2022
'అలీతో సరదాగా' షోకి ఈసారి బాడ్మింటన్ ఛాంపియన్ పీవీ సింధు రాబోతోంది. ఈ షోకి ఎంతో మంది ప్రముఖులు వచ్చి ఎన్నో విషయాలు చెప్తూ ఉంటారు. ఇక ఇప్పుడు పీవీ సింధు వంతు వచ్చేసింది. ఆలీతో సరదాగా లేటెస్ట్ షో ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో పీవీ సింధు ఎన్నో విషయాలను షేర్ చేసుకుంది. 'టాలీవుడ్ లో నీకు ఎవరంటే ఇష్టం' అన్న ప్రశ్నకు 'బాహుబలి ప్రభాస్' అని చెప్తుంది. 'సేమ్ హైట్ అనా' అనేసరికి 'ఇద్దరం మంచి ఫ్రెండ్స్' అని చెప్తుంది.
'ఫ్రెండ్స్ తో కలిసి ఎక్కడికి వెళ్లలేకపోతున్నా అని బాధపడుతూ ఉంటావా?'అనేసరికి 'బాధ పడను ఎందుకంటే నేను వాళ్ళ కంటే ఎక్కువ ప్లేసెస్ కి తిరుగుతూ ఉంటాను' అని చెప్పింది. 'ఫ్యూచర్ లో సింధుని స్క్రీన్ మీద హీరోయిన్ గా చూడొచ్చా' అన్న ప్రశ్నకు 'ఏమో నా బయోపిక్ ఉండచ్చేమో ఎవరికి తెల్సు'.. 'మరి బయోపిక్ లో ఫాదర్ వేషం మీ నాన్నగారేనా' అని అడిగేసరికి 'అన్నీ సీక్రెట్స్ ఇప్పుడే చెప్పేస్తే ఎలా' అంటుంది. 'ఎందుకంటే నేను ఆ బయోపిక్ లో హీరోగా చేద్దామని అనుకుంటున్నా' అని అలీ అంటాడు. ఆ మాటకు సింధు పడీ పడీ నవ్వేస్తుంది.
'ఇప్పటివరకు ఎన్ని లవ్ లెటర్స్ వచ్చాయి?'అని ఆలీ అడిగేసరికి 'అవి ఇంటికి వచ్చేవి కాబట్టి ఆ లవ్ లెటర్స్ ని అందరం కలిసి కూర్చుని చదివేవాళ్ళం' అని చెప్పింది. 'మరి పెళ్లి ఎప్పుడు' అనేసరికి 'నాకు నచ్చాలి కదా' అంటుంది సింధు. 'నేను నీకు మంచి సంబంధం చూస్తాను, అబ్బాయిలు రెడీగా ఉండండి' అని నవ్వుతాడు ఆలీ. 'ఏ మూవీ అంటే ఇష్టం' అని అడిగేసరికి 'సూపర్ మూవీ' అని చెప్తుంది. అందులో ఆలీ వేసిన డ్రెస్ మీద మంచి హ్యూమరస్ కామెంట్స్ చేసేసరికి 'నీ పెళ్ళికి నేను ఆ డ్రెస్ వేసుకొస్తాను' అంటూ మంచి ఫన్ క్రియేట్ చేస్తాడు.